డ్యాన్స్ హాబీ... రీల్స్‌ సరదా!

‘రాఖీ’లో ఎన్టీఆర్‌ చెల్లెలిగా నటించి... ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించని అందం మంజూష. ఇప్పుడు యాంకర్‌గా సుపరిచితురాలు అయిపోయింది. 

This browser does not support the video element.

‘రాఖీ’లో భావోద్వేగాలు పండించి అభిమానుల్ని కంటతడి పెట్టించింది. ఇప్పుడు అయితే గ్లామరస్‌ పోజులతో కుర్రకారు మతులు పోగొడుతోంది.

మంజూష హైదరాబాద్‌లో పుట్టింది. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది.

యాంకరింగ్‌పై ఆసక్తి పెరగడంతో అటుగా అడుగులు వేసింది. యాంకరింగ్‌ చేస్తుండగానే ‘రాఖీ’లో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా నటించకపోయినా టీవీ షోలు, సీరియళ్ల ద్వారా అభిమానుల్ని సంపాదించుకుంది.

వెయ్యికి పైగా కార్యక్రమాల్లో పాల్గొంది. గడగడా మాట్లేడేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటుంది. 

మంజూష తరచూ ఫొటో షూట్‌లు చేస్తుంటుంది. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తే లైకులే లైకులు.

This browser does not support the video element.

డ్యాన్స్‌ చేయడం హాబీ.. ఆ రీల్స్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేయడం సరదా. అందులో ఓ వైరల్‌ వీడియో ఇది.

ఖాళీ సమయాల్లో ఎక్కువగా సినిమాలు చూస్తాను. విహార యాత్రలకు వెళ్తాను. అప్పుడప్పుడూ పుస్తకాలు చదువుతాను అంటోంది మంజూష.

‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

‘దబిడి దిబిడి’.. ఊర్వశి సందడి

ఓటీటీలో.. గ్రేటెస్ట్‌ కార్‌ మూవీస్‌

Eenadu.net Home