ఆండ్రియా జెరెమియా.. అందం చూడవయా..!
యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్, హర్రర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటుంది నటి ఆండ్రియా జెరెమియా.
Image : Andrea jeremiah
తాజాగా ఆమె ‘నో ఎంట్రీ’ సినిమాలో సాహసాలు చేసే యువతిగా కనిపించనుంది. ఆర్. అళగు కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Image : Andrea jeremiah
తెరపై నాజూకు అందంతో మెప్పించే ఈ భామ తెలుగులో నేరుగా నటించిన చిత్రం ‘తడాఖా’ మాత్రమే. ఎక్కువగా తమిళ్‌లో.. అప్పుడప్పుడూ హిందీ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ ఉంటుంది.
Image : Andrea jeremiah
కార్తీ హీరోగా తెరకెక్కిన ‘యుగానికి ఒక్కడు’ మొదలుకొని ఈమె నటించిన చాలా చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. అందుకే ఈమెకు తెలుగునాట కూడా అభిమానులున్నారు.
Image : Andrea jeremiah
This browser does not support the video element.
ఆండ్రియాకు ఇన్‌స్టాలో 30 లక్షల మంది ఫాలోవర్లున్నారు. సినిమా, టూర్, ఫిట్‌నెస్ విషయాలను అందులో పోస్టు చేస్తుంటుంది.
Image : Andrea jeremiah
అరక్కోణంలోని ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో ఆండ్రియా జన్మించింది. చిన్నప్పుడే పియానో వాయించడం నేర్చుకొని ‘జాక్సన్ ఫైవ్’ అనే ప్రసిద్ధ బ్యాండులో చోటు దక్కించుకుంది.
Image : Andrea jeremiah
సైకియాట్రిస్టు కావాలనుకున్న ఈమె కళలపై మక్కువతో థియేటర్ ఆర్ట్స్ చేసి పలు ప్రదర్శనలు ఇచ్చింది. వాటిని చూసి కళాశాలలో ఉన్నప్పుడే అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించింది.
Image : Andrea jeremiah
కళాశాల విద్య పూర్తయిన తర్వాత కొన్ని యాడ్‌లు, ఓ సీరియల్‌లో నటించిన ఆండ్రియా ‘పచాయ్‌కిలి ముథుచరణం’ అనే తమిళ సినిమాతో అరంగేట్రం చేసింది.
Image : Andrea jeremiah
‘విశ్వరూపం’, ‘తడాఖా’, ‘తారామణి’, ‘యుగానికి ఒక్కడు’, ‘వడ చెన్నై’ సినిమాలు ఈమెకు నటిగా గుర్తింపు తేవడమే కాకుండా కమర్షియల్‌గాను విజయం సాధించాయి.
Image : Andrea jeremiah
‘అన్నయూమ్ రసూలం’తో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటిగా తనకు ఈ చిత్రం ఎంతో గుర్తింపు తెచ్చిందని ఆండ్రియా ఓ సందర్భంలో తెలిపింది.
Image : Andrea jeremiah
నటన కంటే సంగీతంపైనే ఆండ్రియాకు మక్కువ ఎక్కువ. అందుకే హారిస్ జయరాజ్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్, తమన్, దేవిశ్రీ వంటి సంగీత దర్శకులు ఆమెకు పాడే అవకాశం కల్పించారు.
Image : Andrea jeremiah
తెలుగులో ‘రాఖీ’, ‘దేశముదురు’, ‘ఎవడు’, ‘భరత్ అనే నేను’ చిత్రాల్లో పాటలు ఆలపించింది. కొన్ని తమిళ టీవీ పాటల షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది.
Image : Andrea jeremiah
ఆండ్రియా పలువురు నటీమణులకు గాత్రదానం కూడా చేసింది. కమలినీ ముఖర్జీ, తాప్సీ, ఇలియానా, అమీ జాక్సన్‌లకు డబ్బింగ్ చెప్పింది.
Image : Andrea jeremiah
ఈ ఏడాది ఆండ్రియా చేతిలో ఆరు చిత్రాలున్నాయి. అందులో మూడు షూటింగ్ పూర్తి కాగా మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి.
Image : Andrea jeremiah