బుట్టబొమ్మ మొదటి పారితోషికం

రూ. 500!

 2007లో మలయాళంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది అనికా సురేంద్రన్‌. తాజాగా ‘కప్‌’ అనే మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

14ఏళ్ల తన సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, మలయాళం అని భాషతో తేడా లేకుండా పలు చిత్రాలతో అలరిస్తోంది. తమిళంలో నటించిన ‘వాసువిన్‌ గర్‌బినిగల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.  

2004లో కేరళలో పుట్టింది అనిక. మూడు సంవత్సరాల వయసులోనే తన సినీ ప్రయాణం మొదలైంది. ‘ఛోటా ముంబయి’తో తెరపై కనిపించి రూ.500 మొదటి పారితోషికాన్ని అందుకుంది.  

పాఠశాల చదువంతా మంజేరీలో సాగింది. ప్రస్తుతం కొయికోడ్‌లోని దేవగిరి సీఎంఐ పబ్లిక్ స్కూల్లో సెకండరీ విద్యను కొనసాగిస్తుంది.

2010తో ‘కధ తుడరున్ను’తో మలయాళంలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచీ ఏడాదికి కనీసం రెండు లేదా మూడు చిత్రాలతో కెరీర్‌లో దూసుకుపోతుంది.

పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ‘అమితాబ్‌ సర్‌తో కలిసి చేసిన మాల్‌కిస్ట్‌ బిస్కెట్‌ యాడ్‌ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటోంది అనిక.

ఈమె 2020లో యూట్యూబ్‌ ఛానల్‌ను పెట్టింది. ఇందులో 15 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 1000 పోస్టులు పెట్టింది.

అనిక జంతు ప్రేమికురాలు. తన వద్ద ఉన్న పిల్లితో ఫొటోలు దిగి తరచూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. 

ఎన్ని మోడ్రెన్‌ డ్రెస్సులు వచ్చినా తన ఫేవరెట్‌ మాత్రం శారీనే. ‘చీరకట్టులో ఉండే ఆ అందమే వేరు’ అని సోషల్‌ మీడియాలో క్యాప్షన్‌ జోడించి ఫొటోలు పంచుకుంటుంది. 

ఫొటోషూట్లు, వెకేషన్‌ మెమోరీస్‌, సినిమా ప్రచార చిత్రాలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. అనిక ఇన్‌స్టా ఖాతాకి 26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home