యానిమల్‌తో ట్రెండింగ్‌లో త్రిప్తి

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే ‘యానిమల్‌’ పెద్ద హిట్‌. రష్మికకీ మంచి పేరొచ్చింది. అయితే అందరి దృష్టినీ ఆకట్టుకున్న మరో తార త్రిప్తి డిమ్రీ. హద్దులు దాటి కనిపించి మెప్పించిందామె.

‘యానిమల్‌’ చూసిన ప్రేక్షకులు ఈ బ్యూటీ గురించి గూగుల్‌లో, సోషల్‌ మీడియాలో సెర్చ్‌ చెయ్యడం ప్రారంభించారు. అలా ట్రెండింగ్‌లో ఉంది. 

సినిమాలో జోయాగా నటించిన త్రిప్తి... రణ్‌బీర్‌తో ఓ రొమాంటిక్‌ సీన్‌ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది. 

ఉత్తరాఖండ్‌లో జన్మించిన త్రిప్తికి చిన్నప్పటి నుంచే మోడలింగ్‌పై ఆసక్తి. క్యాట్ వాక్‌తో కళ్లు తిప్పుకొనేలా ముందంజ వేసింది.

‘పోస్టర్‌ బాయ్స్‌’తో 2017లో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘మామ్‌’, ‘లైలా మజ్ను’, ‘బుల్ బుల్‌’ వంటి చిత్రాల్లో నటించింది.

బాలీవుడ్‌లో ‘కలా’ అనే పీరియాడిక్‌ చిత్రంతో త్రిప్తికి గుర్తింపు వచ్చింది. ఇందులో ఓ పాట కూడా పాడింది. అనుష్క శర్మ దీనికి నిర్మాత. 

‘మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌’, ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ షూటింగ్‌తో బిజీబిజీగా ఉంది. ‘రణ్‌బీర్‌తో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. మళ్లీ అవకాశం వస్తే తనతో మరోసారి తెరపై కనిపిస్తాను’ అంటోంది త్రిప్తి.

‘‘కలా’ షూటింగ్‌లో ఒత్తిడికి గురయ్యేదాన్ని. ఆ సమయంలో అనుష్క చాలా సపోర్టు చేశారు. ‘కావాల్సినంత సమయం తీసుకో... అప్పుడే టేక్‌ ఓకే చేద్దాం’ అంటూ ధైర్యం ఇచ్చారు’’ అని తెలిపింది త్రిప్తి.

ఖాళీ సమయంలో స్విమ్మింగ్‌, ట్రావెలింగ్‌ చేయడం ఇష్టమని చెప్పే త్రిప్తి... సింగర్‌ కూడా. వివిధ లైవ్‌ మ్యూజిక్ ప్రదర్శనలూ ఇచ్చింది.

ఈ బ్యూటీకి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. ఇన్‌స్టాలో వాటి ఫొటోలు ఎక్కువగా పంచుకుంటుంది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్స్‌ 9 లక్షలకు పై మాటే. 

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home