అను.. చాలా హాట్‌ గురూ!

కుర్రాళ్ల మనసును కొల్లగొట్టే అందం.. అను ఇమ్మాన్యుయేల్‌ సొంతం. వరుసగా సినిమాల్లో నటిస్తున్నా అనుకున్న గుర్తింపు మాత్రం రావట్లేదు.

Image: Instagram

తాజాగా ఆమె అల్లు శిరీష్‌కు జోడీగా ‘ఊర్విశివో.. రాక్షసివో’లో నటించింది. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image: Instagram

శిరీష్‌ - అను కెమిస్ట్రీ కుర్రకారుని కిర్రెక్కిస్తోంది. ఈ సినిమాకి మొదట ‘ప్రేమ కాదంట’ అని టైటిల్‌ పెట్టారు. ఆ తర్వాత ‘ఊర్వశివో.. రాక్షసివో’ అని మార్చారు.

Image: Instagram

మార్చి 28, 1996న అమెరికాలో జన్మించింది అను. ఆమె తండ్రి మలయాళీ చిత్రాల నిర్మాత. కుటుంబమంతా టెక్సాస్‌లో స్థిరపడింది.

Image: Instagram

అను.. చదువంతా అమెరికాలోనే సాగింది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే తన తండ్రి నిర్మించిన ‘స్వప్న సంచారి’లో బాలనటిగా మెరిసింది.

Image: Instagram

ఇంట్లో సినిమా వాతావరణమే ఉండటంతో చిన్నతనంలోనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట.

Image: Instagram

డిగ్రీ చేస్తూనే మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. ఫ్యాషన్‌ దుస్తుల్లో ఫొటోలు దిగి ప్రొఫైల్‌ తయారుచేసుకుంది.

Image: Instagram

అను ప్రొఫైల్‌ చూసిన మలయాళ దర్శకుడు అబ్రిడ్‌ షైన్‌ ‘యాక్షన్‌ హీరో బిజు’లో అవకాశం ఇచ్చారు.

Image: Instagram

తెలుగులో ‘మజ్ను’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్‌’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ తదితర సినిమాల్లో నటించింది.

Image: Instagram

గ్లామర్‌లో ఏ మాత్రం తక్కువ కాకున్నా.. నటనపరంగా ఆశించినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. 

Image: Instagram

2021లో అను చేసిన ‘అల్లుడు అదుర్స్‌’, ‘మహా సముద్రం’ నిరాశపర్చాయి. ప్రస్తుతం రవితేజ ‘రావణాసుర’లో అను నటిస్తోంది.

Image: Instagram

తన సౌందర్యానికి, ఫిట్‌నెస్‌కి సీక్రెట్‌.. రోజూ వ్యాయామం చేయడమే అని చెబుతుంది అను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజులో నాలుగైదు సార్లు తీసుకుంటుందట.

Image: Instagram

ఖాళీ సమయం దొరికితే సినిమాలు చూస్తుందట. అవే తనకు నటనలో పాఠాలు నేర్పిస్తాయని చెబుతుంటుంది.

Image: Instagram

కచ్చితంగా ప్రేమ పెళ్లే చేసుకుంటా అని చెప్పిన అను.. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌ మీదే ఉందంటోందీ.

Image: Instagram

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

Eenadu.net Home