మాయ చేస్తోన్న మలయాళీ అందం!

‘ప్రేమమ్‌’తో వెండితెరకు పరిచయమైంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌.

Source: Instagram/Anupama Parameswaran

తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వచ్చాయి. 

Source: Instagram/Anupama Parameswaran

అనుపమ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని ఇరింజలకూడలో జన్మించింది. 

Source: Instagram/Anupama Parameswaran

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్‌, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘మరీచిక’ అనే పేరుని ఖరారు చేశారు.

Source: Instagram/Anupama Parameswaran

‘ప్రేమమ్‌’ తెలుగు రీమేక్‌లోనూ నటించిన ఈ కేరళ కుట్టీ.. నితిన్‌ హీరోగా వచ్చిన ‘అ ఆ’తో టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకుంది.

Source: Instagram/Anupama Parameswaran

శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, తేజ్, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు వంటి సినిమాల్లో నటించింది. 

Source: Instagram/Anupama Parameswaran 

2021లో విడుదలైన ‘రౌడీబాయ్స్‌’తో యూత్‌లో తన క్రేజ్‌ని మరింత పెంచుకుంది.

Source: Instagram/Anupama Parameswaran

‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లోనూ నటించింది.

Source: Instagram/Anupama Parameswaran

‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’లో నటనకుగానూ 6వ ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అనుపమకు ఉత్తమ నటి అవార్డు లభించింది.

Source: Instagram/Anupama Parameswaran

‘కార్తికేయ2’లో నిఖిల్‌ సరసన అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Instagram/Anupama Parameswaran

ఆమె ప్రస్తుతం ‘బటర్‌ఫ్లై’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌తోపాటు ‘18 పేజెస్’ చిత్రాల్లో నటిస్తోంది.

Source: Instagram/Anupama Parameswaran

అనుపమ పరమేశ్వరన్‌లో మంచి నటితో పాటు చక్కని గాయని ఉందన్న సంగతి తెలిసిందే. ‘బటర్‌ఫ్లై’లో ‘‘ఆల్‌ ద లేడీస్‌..’’ అనే గీతాన్ని స్వయంగా ఆలపించింది.

Source: Instagram/Anupama Parameswaran

ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమెకి 12.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు

Source: Instagram/Anupama Parameswaran

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home