అనుపమ.. (అందం)2

ఇటీవల ‘ఈగల్‌’తో అలరించిన అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్‌’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సినిమా పోస్టర్లు, ట్రైలర్‌లో ఆమె లుక్స్‌కి యువత ఫిదా అయింది. ఈ సినిమాలో లిల్లీగా గ్లామర్‌ డోసు పెంచేసింది. 

నటన కంటే ముందుగా అనుపమకి దర్శకత్వం అంటేనే ఇష్టం. ‘మనియారాయిలే అశోకన్‌’ అనే మలయాళ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది.

డిగ్రీ చదువుతున్న సమయంలో మలయాళం ‘ప్రేమమ్‌’లో అవకాశం వచ్చింది. అలా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటనపై దృష్టి పెట్టింది.

‘ఉన్నది ఒక్కటే జిందగీ’ కోసం పట్టుదలతో తెలుగు నేర్చుకొని సొంతంగా డబ్బింగ్‌ చెప్పింది. ఆ తర్వాత అలాగే కొనసాగిస్తోంది.

రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో హీరోయిన్‌గా మొదట అనుపమనే ఎంపిక చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేకపోయింది.

‘అంత మంచి కథలో నటించలేదనే బాధ ఉన్నా.. సినిమా చూసిన తర్వాత సమంత కంటే నేను బాగా చేయలేనేమో అనిపించింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

ఈ మలయాళీ కుట్టి.. ఇంటి ఫుడ్‌కే ప్రాధాన్యమిస్తుంది. అమ్మ వండే చికెన్‌, పప్పన్నం అంటే ఎంతో ఇష్టమని చెబుతోంది. 

This browser does not support the video element.

రింగుల జుట్టు సొగసరికి ముక్కుపుడక, చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. ఖాళీ సమయాల్లో గార్డెనింగ్‌, పెయింటింగ్‌ చేస్తుంది. 

ఇటీవల సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళంలో ‘జేఎస్‌కే ట్రూత్‌ షెల్‌ ఆల్వేస్‌ ప్రివైల్‌’లో నటిస్తోంది. 

This browser does not support the video element.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సోదరుడితో కలసి రీల్స్‌ చేసి పోస్టు చేస్తుంటుంది.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home