ఐఫోన్ల గురించి ఆసక్తికర విషయాలు తెలుసా?


యాపిల్‌ తన తొలి ఐఫోన్‌ను 2007లో లాంచ్‌ చేసింది. ఫస్ట్‌ జనరేషన్‌ ఐఫోన్‌ అమెరికాలో మాత్రమే విక్రయించారు.

తొలి ఐఫోన్‌లో కేవలం మెయిల్‌, కెమెరా, సఫారీ బ్రౌజర్‌, యూట్యూబ్‌ మాత్రమే ఉండేవి. స్క్రీన్‌ కూడా 3.5 అంగుళాలు మాత్రమే. యాపిల్‌ నుంచి తొలి ఫోన్‌ 6 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 

ఐఫోన్‌ ట్రేడ్‌మార్క్‌ వాస్తవానికి సిస్కోది. దీనిపై రెండు సంస్థలు కోర్టుకెళ్లాయి. ట్రేడ్‌మార్క్‌ను ఇరు సంస్థలూ ఉపయోగించకునేలా ఓ ఒప్పందానికి వచ్చాయి.


యాపిల్‌ ఐఫోన్లలో తొలి నాళ్లలో కాపీ, పేస్ట్‌ అనే ఆప్షనే ఉండేది కాదు. 2009లో వచ్చిన ఐఫోన్‌ ఓఎస్‌ 3లో తొలుత కాపీ, పేస్ట్ అనే ఆప్షన్‌ తీసుకొచ్చారు.

తొలి ఐఫోన్‌లో వీడియో రికార్డింగ్‌ ఆప్షన్‌ కూడా లేదు. ఇప్పుడైతే 4K రికార్డింగ్‌ సదుపాయం వచ్చేసింది. ఐఫోన్లతో సినిమాలు సైతం తీశారు. 

యాపిల్‌ ఫోన్లలో యాడ్స్‌ గమనిస్తే అన్నింటిలోనూ 9.41AM అని ఉంటుంది. ఎందుకంటే 2007 జూన్‌ 29న అదే సమయానికి స్టీవ్‌ జాబ్స్‌ తొలి ఐఫోన్‌ను విడుదల చేశారు.

యాపిల్‌ కంపెనీకి ప్రధాన ఆదాయం ఐఫోన్ల నుంచే. దాదాపు 60 శాతం ఆదాయం ఐఫోన్ల ద్వారానే యాపిల్‌కు సమకూరుతోంది.

ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో యాపిల్‌ ఐఫోన్‌ వాటా 20 శాతమే అయినప్పటికీ.. లాభాల పరంగా మాత్రం 80 శాతం వాటా యాపిల్‌దే. 

యాపిల్‌ తన కొత్త ఐఫోన్లను ఆవిష్కరణకు ఏటా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. సెప్టెంబర్‌ నెలలో వచ్చే తొలి, రెండో మంగళవారం లేదా బుధవారం ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తూ ఉంటుంది.

ఇప్పుడు దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న చెల్లింపుల వ్యవస్థ, టచ్‌ ఐడీ (ఫింగర్‌ ప్రింట్‌) వంటి ఫీచర్లన్నీ తొలుత ఐఫోన్లలో వచ్చినవే.

This browser does not support the video element.


అన్ని సంస్థలూ తాము తీసుకురాబోయే ఫోన్ల గురించి కొన్ని టీజర్లను విడుదల చేస్తాయి. యాపిల్‌ మాత్రం అందుకు వ్యతిరేకం.

ఫోన్‌కి ఎడిక్ట్‌ అయ్యారా.. ఇలా దూరం పెట్టండి!

సైబర్‌ దొంగలకు చిక్కకుండా ఉండేందుకు ఇవి పాటించండి

షావోమీ @10.. లాంచ్‌ చేసిన కొత్త ఉత్పత్తులివే..!

Eenadu.net Home