అవికా.. బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌!

టీవీ సీరియల్‌ ‘బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)’తో బాలనటిగా దేశవ్యాప్తంగా పాపులరైన అవికా గోర్‌.. హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ అందుకోలేకపోతుంది.

Image: Instagram/avika gor

ఇటీవల ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’, ‘థ్యాంక్‌ యూ’తో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. అవికాకు నిరాశే ఎదురైంది.

Image: Instagram/avika gor

ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె ‘ఉమాపతి’లో నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా తనే కావడం విశేషం.

Image: Instagram/avika gor

సత్య ద్వారపూడి దర్శకత్వంలో యువ హీరో అనురాగ్‌ నటిస్తున్న ఈ చిత్రంలో అవికా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Image: Instagram/avika gor

ముంబయిలో 1997 జూన్‌ 30న జన్మించిన అవికా.. చిన్నప్పుడే నటనలో ఓనమాలు నేర్చుకుంది.

Image: Instagram/avika gor

‘రాజ్‌కుమార్‌ ఆర్యన్‌’, ‘ససురాల్‌ సిమర్‌ కా’ ఇలా అనేక సీరియల్స్‌లో నటించినా.. ‘బాలికా వధు’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image: Instagram/avika gor

This browser does not support the video element.

‘మార్నింగ్‌ వాక్‌(2009)’, ‘పాఠశాల(2010)’, ‘తేజ్‌(2012)’ చిత్రాల్లో సహాయక పాత్రల్లో మెరిసింది అవికా.

Image: Instagram/avika gor

టాలీవుడ్‌లో 2013లో విడుదలైన ‘ఉయ్యాలా జంపాలా’తో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రం హిట్‌ కావడంతో తెలుగులో బోలెడు అవకాశాలు వచ్చాయి.

Image: Instagram/avika gor

అలా ‘లక్ష్మి రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది-3’ తదితర చిత్రాల్లో నటించింది.

Image: Instagram/avika gor

ఇన్ని సినిమాలు చేసినా.. నటిగా ఆమెకు ఇప్పటి వరకు మంచి బ్రేక్‌ రాలేదు. అయినా.. తన చేతిలో ఇంకా నాలుగైదు సినిమాలున్నాయి.

Image: Instagram/avika gor

త్వరలో ‘కహానీ రబ్బర్‌బ్యాండ్‌ కి’, ‘1920-హర్రర్స్‌ ఆఫ్ ది హార్ట్‌’చిత్రాలతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం కానుంది.

Image: Instagram/avika gor

అంతే కాదండోయ్‌ ఈ చిన్నారి పెళ్లి కూతురు ఏకంగా కజకిస్థాన్‌లోని కజక్ భాషలో తెరకెక్కిన ‘ఐ గో టూ స్కూల్‌’లోనూ నటించింది.

Image: Instagram/avika gor

This browser does not support the video element.

ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ యంగ్‌ బ్యూటీ.. కొన్నాళ్ల కిందట సన్నబడింది. ఆమెలో మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Image: Instagram/avika gor

హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ సీఈవోగా ఉన్న మిలింద్‌ చంద్వానీతో గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.

Image: Instagram/avika gor

అవికా నటిగానే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది. అవికా స్క్రీన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇప్పటికే ఆమె ‘పాప్‌కార్న్‌’పేరుతో ఓ సినిమాని నిర్మించింది.

Image: Instagram/avika gor

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

దర్శకుల గురించి తారక్‌ సూపర్‌ మాటలు!

Eenadu.net Home