ప్రేమ కథలో నటించాలనుంది..!

ఇటీవల‘వధువు’ వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకున్న అవికా గోర్‌ తాజాగా ‘ఉమాపతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం డిసెంబరు 29న విడుదలైంది.

అనురాగ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి సత్య ద్వారం పూడి దర్శకుడు. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా ఉమ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

ఈ ఏడాది తెలుగులో ‘పాప్‌కార్న్‌’,‘1920: హారర్స్‌ ఆఫ్‌ద హార్ట్‌’ చిత్రాలు.. ‘వధువు’, ‘మ్యాన్షన్‌ 24’ వెబ్‌ సిరీస్‌లతో అలరించిందీ చిన్నారి పెళ్లికూతురు.

నందు సరసన ‘అగ్లీ స్టోరీ’లో నటిస్తోంది. త్వరలో ‘వధువు’ వెబ్‌సిరీస్‌ రెండో సీజన్‌ వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీ బిజీగా ఉంది.

‘ఏడేళ్ల వయసులోనే నటిగా ప్రయాణం మొదలుపెట్టాను. తెరపై చాలా సార్లు వధువుగా కనిపించా. అప్పట్లో పెళ్లంటే అర్థం తెలియదు. ‘వధువు’ వెబ్‌సిరీస్‌తో పెళ్లికి అర్థం తెలుసుకున్నా’ అని చెబుతుంది అవికా.

ఈ మధ్య ఎక్కువగా సస్పెన్స్‌, థ్రిల్లర్‌ చిత్రాల్లోనే నటిస్తున్న అవికాకు.. అవకాశం వస్తే ఓ మంచి ప్రేమకథలో నటించాలని ఉందట. అలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నానని అంటోంది.

ఈమె 2021లో ‘అవికా స్క్రీన్‌ క్రియేషన్స్‌’ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించింది. ‘పాప్‌కార్న్‌’ చిత్రం ఈ బ్యానర్‌పై నిర్మించిందే.

ఈ భామకు సామాజిక బాధ్యత కూడా ఎక్కువే. సమాజంలో మార్పు కోసం నిర్వహించే అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా క్యాంపైన్‌లు నిర్వహిస్తుంటుంది.

‘గార్లిక్‌ నూడుల్స్‌, పావ్‌ బాజీని బాగా లాగించేస్తాను. ఏ ఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన పాటలను ఎక్కువగా వింటాను. హృతిక్‌ రోషన్‌కి వీరాభిమానిని’ అని చెప్పింది.

అవికా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ నెటిజన్లని కట్టిపడేస్తోంది. తన ఇన్‌స్టా ఖాతాకి 1.6 మిలియన్‌ ఫాలోవర్లున్నారు.

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home