డ్యాన్సర్.. యాక్టర్.. ఈ అందాల అవనీత్ కౌర్..
అవనీత్ కౌర్.. డ్యాన్సర్‌గా, యాక్టర్‌గా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ‘టీకూ వెడ్స్ షేరు’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Image: Instagram/Avneet Kaur
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిర్మించిన ఈ ఓటీటీ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీకి జోడీగా అవనీత్ నటించింది. ఈ చిత్రం జూన్ 23న విడుదలకానుంది.
Image: Instagram/Avneet Kaur
పంజాబ్‌లో 2002 అక్టోబర్ 13న జన్మించిన ఈ బ్యూటీ.. ఎనిమిదేళ్ల వయసు నుంచే డ్యాన్సర్‌గా రాణిస్తోంది.
Image: Instagram/Avneet Kaur
జీటీవీలో ప్రసారమైన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్’లో తన ప్రతిభతో సెమీ ఫైనల్ వరకు వచ్చింది. ‘డ్యాన్స్ కి సూపర్‌స్టార్స్’, ‘ఝలక్ దిఖ్లా జా 5’ తదితర డ్యాన్స్ షోల్లో పాల్గొంది.
Image: Instagram/Avneet Kaur
ఓవైపు డ్యాన్స్ షోల్లో పాల్గొంటూనే.. 2012లో తొలిసారిగా ‘మేరీ మా’ టీవీ సీరియల్‌తో నటిగా మారింది. ‘సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ’, ‘హమారీ సిస్టర్ దీదీ’ తదితర సీరియల్స్‌లోనూ నటించింది.
Image: Instagram/Avneet Kaur
సోనీ టీవీలో 2018-2020 మధ్య ప్రసారమైన ‘అలాద్దీన్’ సీరియల్‌లో హీరోయిన్ యాస్మిన్ పాత్ర పోషించడంతో అవనీత్‌కు బీటౌన్‌లో క్రేజ్ పెరిగింది.
Image: Instagram/Avneet Kaur
రాణి ముఖర్జీ నటించిన ‘మర్దానీ(2014)’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అవనీత్. అందులో మీరా పాత్రలో నటించి ఆకట్టుకుంది.
Image: Instagram/Avneet Kaur
ఆ తర్వాత ‘దోస్త్’, ‘బ్రూనీ’, ‘ఏక్త’, ‘మర్దానీ 2’ తదితర సినిమాల్లో నటించింది. ‘బాబర్ కా తాబర్’, ‘బండీష్ బండిట్స్’ వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకుల్ని పలకరించింది.
Image: Instagram/Avneet Kaur
సినిమాలు, వెబ్‌సిరీస్‌లే కాదు.. పలు బాలీవుడ్, పంజాబీ మ్యూజిక్ వీడియోల్లోనూ ఆడిపాడింది.
Image: Instagram/Avneet Kaur
సోషల్‌మీడియాలో అవనీత్ చాలా యాక్టివ్. ఇన్‌స్టాలో ఈమెకు 32.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/Avneet Kaur