పాటతో ‘మోత’ మోగించిన అయేషా ఖాన్
‘మోత మోగిపోద్ది’ అంటూ తనలోని డ్యాన్సర్‌ని పరిచయం చేసింది అయేషా ఖాన్. విశ్వక్ సేన్‌తో స్టెప్పులేసి అదరగొట్టింది. వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ గురించి కొన్ని విశేషాలు..
ముంబయికి చెందిన ఈ భామ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.
నటనపై ఆసక్తితో అటుగా అడుగులు వేసింది. అలా జూనియర్ ఆర్టిస్ట్‌గా ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌కి పనిచేసింది.
‘బాలవీర్ రిటర్న్స్’ సీరియల్‌లో నెగెటివ్ రోల్‌లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది.
బుల్లితెర ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న అయేషా ‘బిగ్‌బాస్ సీజన్ 17’ (హిందీ)లో పాల్గొంది.
‘బిగ్‌బాస్’కు వెళ్లకుముందే టాలీవుడ్‌లో నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమానే ‘ముఖచిత్రం’ (2022).
అందులో.. హీరోని అమితంగా ప్రేమించే అమ్మాయి మాయా ఫెర్నాండెజ్‌గా ఆకట్టుకుంది. వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని ఇతర ప్రధాన పాత్రధారులు.
తర్వాత, తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఇటీవల విడుదలైన ‘ఓం భీమ్ బుష్’లో రత్తాలు పాత్రలో సందడి చేసింది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోని ప్రత్యేక గీతం ‘మోత మోగిపోద్ది’లో డ్యాన్స్ చేసి, ఉర్రూతలూగించింది. హోలీ సందర్భంగా ఈ సాంగ్ విడుదలైంది.
విశ్వక్‌సేన్, నేహాశెట్టి జంటగా నటించిన ఆ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘లక్కీ భాస్కర్’లోనూ ఈ బ్యూటీ భాగమైంది. ఏదైనా కీలక పాత్ర పోషిస్తుందా? ప్రత్యేక గీతంలో నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రమిది.
దర్శకుడు రాజమౌళితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇది ఫొటో మాత్రమే కాదు ఓ ఎమోషన్’ అని పేర్కొంది.