‘బబుల్‌గమ్‌’తో ఆంధ్రా అందం

సుమ కనకాల తనయుడు రోషన్‌ సరసన ‘బబుల్‌గమ్‌’తో ఎంట్రీ ఇచ్చింది మానస చౌదరి. ఈ చిత్రం డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మానస చౌదరి గురించి ఆసక్తికర విషయాలు..

ఇటీవల విడుదలైన సినిమాకు యువత నుంచి మంచి స్పందన వచ్చింది. రోషన్‌, మానసల జోడీ అదిరిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మానసది చిత్తూరు జిల్లాలోని పుత్తూరు. చెన్నైలో పెరిగింది. సినీ నేపథ్యం లేదు. చదువు అనంతరం మోడలింగ్‌లోకి, ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

‘రోషన్‌కీ నాకూ ఇది మొదటి చిత్రం. మోడలింగ్‌ వల్లనేమో కెమెరా అంటే నాకు భయమేమీ లేదు. కానీ దర్శకుడి అంచనాలకు తగ్గట్లుగా చేస్తున్నానా లేదా అని మాత్రం ఆలోచించేదాన్ని’ అని చెబుతుంది మానస.  

మోడలింగ్‌తో వచ్చిన అవకాశంతో ‘ఇమోజి’ అనే తమిళ వెబ్‌సిరీస్‌లో నటించింది.

ఈమెకి చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. తన ఇన్‌స్టాలో ఎక్కువగా ఆ ఫొటోలే ఉంటాయి.

This browser does not support the video element.

 ప్రకృతి ప్రేమికురాలు. ఎక్కువగా ఒంటరిగా విహారయాత్రలకు వెళ్తూ ఉంటుంది. ఇష్టమైన ప్రదేశం గోవా.

’‘ఇలాంటి పాత్రలే చేయాలని నాకు కోరికలేం కావు.. పిరియాడికల్‌ చిత్రాలంటే ఇష్టం.. థ్రిల్లింగ్‌గా అనిపించే పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను..’’

ఫొటో షూట్లంటే అంటే ఎంతో ఇష్టం. కొండలు, సెలయేటి అలల వద్ద ఎక్కువగా ఫొటోలు తీసుకుంటుంది.

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home