బార్బడోస్ అందాలు.. ఐలాండ్ విశేషాలు!
బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్ గెలుపొంది కప్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మధ్యలో చూపించిన అక్కడి ప్రకృతి అందాలు వీక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మరి ఆ బుల్లి ఐలాండ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..
కరేబియన్ దీవుల్లో ఒకటైన బార్బడోస్‌కి ఆ పేరు చెట్టు నుంచి వచ్చింది. 1536లో పోర్చుగీసు వాళ్లు ఈ ఐలాండ్‌ను కొనుగొన్నారు. అక్కడ మర్రి చెట్టులాంటి చెట్టు (పోర్చుగీసులో లాస్ బార్బడోస్)మాత్రమే కనిపించిందట. అందుకే దానికా పేరు పెట్టారు.
మొత్తంగా 166 చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐలాండ్‌ను 11 ప్రాంతాలుగా విభజించారు. ఆయా ప్రాంతాల్ని పరిష్ అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు 3లక్షల జనాభా ఉంది.
ఈ ఐలాండ్‌లో 80కిపైగా అందమైన బీచ్‌లున్నాయి. సముద్రపు అలలపై సర్ఫింగ్, స్నోర్కలింగ్, స్కూబా వంటివి ట్రై చేయొచ్చు. ఆఫ్-రోడ్ అడ్వెంచర్స్ ఎంజాయ్ చేయొచ్చు.
బార్బడోస్‌లోని ప్రకృతి సోయగాలు కట్టిపడేస్తాయి. మౌంట్ హిల్లాబే సముద్ర మట్టానికి 1,115 ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ఐలాండ్ అందాలు తప్పక వీక్షించాల్సిందే.
డెస్టినేషన్ వెడ్డింగ్‌కి పర్‌ఫెక్ట్ ప్లేస్‌గా పేరు తెచ్చుకుంది బార్బడోస్. విదేశీయులు చాలా మంది పెళ్లి వేడుక కోసం ఇక్కడికి వస్తుంటారు. రాజధాని బ్రిడ్జ్‌టౌన్ నగరం యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకుంది.
బార్బడోస్ జాతీయ క్రీడ క్రికెట్. జాతీయ వంటకం కోకో అండ్ ఫ్లయింగ్ ఫిష్. ఇక్కడి కరెన్సీ విలువ అమెరికన్ డాలర్ కన్నా ఎక్కువే. ఒక్క బార్బడోస్ డాలర్.. రెండు అమెరికన్ డాలర్లతో సమానం.
దిగ్గజ క్రికెటర్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్, పాప్ సింగర్ రిహన్నా జన్మించింది బార్బడోస్‌లోనే. రిహన్నా పుట్టి పెరిగిన వీధికి ‘రిహన్నా డ్రైవ్’ అని ఆమె పేరే పెట్టారు.
బార్బడోస్‌కి టూరిజమే పెద్ద ఆదాయ మర్గమని చెప్పొచ్చు. ఏటా దాదాపు 10లక్షల మంది టూరిస్టులు ఈ ఐలాండ్‌ను సందర్శిస్తున్నారు. ఆ దేశ జీడీపీలో టూరిజం వాటా 12శాతంగా ఉంది.
క్రాప్ ఓవర్ పేరుతో జరిగే కరేబియన్ కార్నివల్ అతిపెద్దది. జూన్ నుంచి ఆగస్టు తొలివారం వరకు సాగుతుంది. చివరి రోజు గ్రాండ్ కడూమెంట్ పేరుతో పార్టీ నిర్వహిస్తారు.
All Images Credit: Visit Barbados/tourism.gov.bb