హాలీవుడ్‌లో ప్రియాంక.. భోజ్‌పురిలో మోనాలిసా!
బాలీవుడ్‌లో ఇమడలేక.. హాలీవుడ్‌కు వెళ్లి గ్లోబల్‌స్టార్‌గా ఎదిగింది నటి ప్రియాంక చోప్రా. నటి మోనాలిసా విషయంలోనూ దాదాపు ఇదే జరిగింది.
Image: Instagram/monalisa
బీటౌన్‌లో అవకాశాలు లేకపోవడంతో బిహార్‌కు వెళ్లి.. భోజ్‌పురిలో సూపర్‌స్టార్‌గా మారింది. ఇంతకీ ఎవరీ మోనాలిసా...?
Image: Instagram/monalisa
ఈమె అసలు పేరు అంతరా బిస్వాస్. కోల్‌కతాలో జన్మించింది. నటి అవ్వాలన్న లక్ష్యంతో స్వస్థలం వదిలి ముంబయికి చేరుకుంది.
Image: Instagram/monalisa
అవకాశాల కోసం ప్రయత్నించగా.. 1997లో వచ్చిన ‘జయతే’లో అవకాశం వచ్చింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
Image: Instagram/monalisa
తన నటనకు మెచ్చి హిందీ సినిమాల్లో కంటే.. ఇతర భాషల్లో అవకాశాలొచ్చాయి. అలా ఒడియా, బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.
Image: Instagram/monalisa
తెలుగులో రామ్ నటించిన ‘జగడం’లో ‘36-24-36’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో నర్తించింది.. ఈ భామే. ‘నగరం’, ‘బోణి’, ‘బబ్లూ’లోనూ కీలక పాత్రలు పోషించింది.
Image: Instagram/monalisa
బాలీవుడ్‌లో ఎంత ప్రయత్నించినా.. అడపాదడపా చిన్న సినిమాల్లో మాత్రమే అవకాశాలు వచ్చేవి. దీంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు.
Image: Instagram/monalisa
భోజ్‌పురిలో మోనాలిసా నటించిన ‘భోలే శంకర్(2008)’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో అక్కడే ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి.
Image: Instagram/monalisa
ఏడాదిలో కనీసం నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ అవడమే కాదు.. భోజ్‌పురిలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
Image: Instagram/monalisa
పదేళ్లలోనే (2008-2018) భోజ్‌పురిలో 80కిపైగా సినిమాల్లో నటించిందంటే.. మోనాలిసాకి అక్కడున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
Image: Instagram/monalisa
భోజ్‌పురిలో మాత్రమే పాపులరైన మోనాలిసాకి.. హిందీ బిగ్‌బాస్ సీజన్ 10లో కంటెస్టెంట్‌గా పాల్గొనడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.
Image: Instagram/monalisa
మోనాలిసా.. 2017లో భోజ్‌పురి నటుడు విక్రాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను వివాహం చేసుకుంది.
Image: Instagram/monalisa
గత కొంతకాలంగా ఈ భామ.. భోజ్‌పురిలో సినిమాలు చేయడం మానేసి.. బాలీవుడ్ సీరియల్స్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ‘బెకబూ’ సీరియల్ చేస్తోంది.
Image: Instagram/monalisa
సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మోనాలిసా.. తన గ్లామర్ ఫొటోలు, అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 5.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/monalisa