జాన్వీ మెచ్చిన సర్దార్ని!

నిమ్రిత్‌ కౌర్‌ అహ్లూవాలియా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా హిందీ సీరియల్స్‌తో ఉత్తరాది టీవీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన నటి.

Image: Instagram/nimrit kaur ahluwalia

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌హీరోయిన్‌ జాన్వీ కపూర్‌.. ఈ యంగ్‌ బ్యూటీని ప్రశంసలతో ముచ్చెత్తింది. తను ఎంతో తెలివైన అమ్మాయి అని, ఆమెను చూసి ఫిదా అయ్యానని చెప్పుకొచ్చింది. 

Image: Instagram/nimrit kaur ahluwalia

తను నటించిన ‘మిలీ’ ప్రమోషన్స్‌లో భాగంగా హిందీ ‘బిగ్‌బాస్‌-16’ షోలో పాల్గొంది జాన్వీ. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న నిమ్రిత్‌ కౌర్‌ ఆటతీరును ప్రత్యక్షంగా చూసిన జాన్వీ ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. 

Image: Instagram/nimrit kaur ahluwalia

నిమ్రిత్‌ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతూ.. ఆటలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ.. ప్రేక్షకుల ఫేవరెట్‌ కంటెస్టెంట్‌గా మారింది. 

Image: Instagram/nimrit kaur ahluwalia

నిమ్రిత్‌.. 1994 డిసెంబర్‌ 11న న్యూదిల్లీలో సిక్కు కుటుంబంలో జన్మించింది. ఈ భామ.. మంచి నటే కాదు, న్యాయవాది కూడా. ఛండీఘడ్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకుంది. 

Image: Instagram/nimrit kaur ahluwalia

నటనపై ఆసక్తితో అందులో శిక్షణ కూడా తీసుకున్న నిమ్రిత్‌.. పలు నాటకాల్లోనూ పాల్గొంది. మోడలింగ్‌ చేసింది.

Image: Instagram/nimrit kaur ahluwalia

అలా 2018లో ఫెమినా మిస్‌ ఇండియా మణిపూర్‌ కిరీటం దక్కించుకుంది. మిస్‌ ఇండియా పోటీలో టాప్‌ 12లో నిలిచింది. 

Image: Instagram/nimrit kaur ahluwalia

This browser does not support the video element.

ఆ తర్వాత ఆమెకు హిందీ సీరియల్‌ ‘చోటీ సర్దార్ని’లో నటించే అవకాశం వచ్చింది. అందులో ప్రధాన పాత్ర పోషించడంతో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించింది.

Image: Instagram/nimrit kaur ahluwalia

టీవీ సీరియల్స్‌లో నటిస్తూనే పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో మెరిసింది. పలు రియాల్టీ షోల్లో అతిథిగా తళుక్కుమంది.

Image: Instagram/nimrit kaur ahluwalia

గతంలో బిగ్‌బాస్‌ షో గత సీజన్లలో అతిథిగా వెళ్లిన.. నిమ్రిత్ ప్రస్తుత సీజన్‌(బిగ్‌బాస్‌ - 16)లో కంటెస్టెంట్‌గా కొనసాగుతోంది. 

Image: Instagram/nimrit kaur ahluwalia

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home