'ప్రేమ కోసం' అంటూ ఆడిపాడిన బిగ్ బాస్ భామ

ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ‘భాగ్‌ సాలే’ సినిమాలోని 'ప్రేమ కోసం' పాటలో నర్తించి కుర్రకారును ఆకట్టుకుంది నందిని రాయ్‌. 

Image : nandini rai instagram

తాజాగా తమిళ స్టార్‌ విజయ్‌ ‘వారసుడు’లో స్మిత పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

Image : nandini rai instagram

నందిని రాయ్‌ అసలు పేరు నీలం గౌరాని. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది.

Image : nandini rai instagram

ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగింది. ఎంబీఏ చదవడం కోసం లండన్‌ వెళ్లింది.

Image : nandini rai instagram

మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టింది. దాదాపు 80 వరకు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించింది. 

Image : nandini rai instagram

పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. 2008లో ‘మిస్‌ హైదరాబాద్‌’, 2009లో ‘మిస్‌ పాంటాలూన్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ ఏపీ’, 2010లో ‘మిస్‌ ఆంధ్రప్రదేశ్’, ‘మిస్‌ బ్యూటిఫుల్‌ ఐస్‌ ఆఫ్‌ ఏపీ’టైటిల్స్‌ అందుకుంది.  

Image : nandini rai instagram

తొలిసారి ‘ఫ్యామిలీ ప్యాక్‌’ అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ తరువాత ‘హార్మోన్స్‌’, ‘040’ వంటి చిన్న తెలుగు చిత్రాల్లో నటించింది.

Image : nandini rai instagram 

హిందీ, తెలుగుతోపాటు మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 

Image : nandini rai instagram

2018లో బిగ్‌బాస్‌లో కనిపించి సందడి చేసింది నందిని రాయ్‌. ఆ తర్వాత నుంచి పలు వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ వస్తోంది.

Image : nandini rai instagram

‘గాలి వాన’, ‘ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’, ‘మెట్రో కథలు’, ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’, ‘హై ప్రీస్టెస్’ వెబ్‌సిరీస్‌లలో వైవిధ్యమైన పాత్రలు చేసింది.

Image : nandini rai instagram

నందిని రాయ్‌కి ఇన్‌స్టాలో 4.5లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. తన ఫ్యాషన్‌ ఫొటోలు, సినీ విశేషాలను అందులో తరచూ పోస్టు చేస్తుంటుంది. 

Image : nandini rai instagram

ఈ బొద్దుగుమ్మకు భరతనాట్యం కూడా వచ్చు. అందులో కొన్నాళ్లు శిక్షణ తీసుకుంది. ఖాళీ సమయం దొరికితే పెయింటింగ్స్‌ వేస్తుందట.

Image : nandini rai instagram

This browser does not support the video element.

ఈమెకు భక్తి కూడా ఎక్కువే. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లింది. మోకాళ్ల పర్వతం ఎక్కుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

Image : nandini rai instagram

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

మీర్జాపూర్‌ సుందరి.. హర్షితా గౌర్‌

ఐఎండీబీ టాప్‌ టెన్‌ వెబ్‌సిరీస్‌

Eenadu.net Home