అది నా చిన్ననాటి కల!

‘పట్టాదారీ(2016)’తో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.. మిర్నా మేనన్‌. ప్రస్తుతం ‘బర్త్‌ మార్క్‌’తో సందడి చేస్తోంది.

ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోంది. ఇందులో జెన్నీఫర్‌ పాత్రలో అలరిస్తోంది మిర్నా.

‘జైలర్‌’లో రజనీకాంత్‌ కోడలిగా కనిపించింది ఈమెనే. ఆ మూవీ సీక్వెల్‌లోనూ నటించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

‘రజనీ సార్‌కి చిన్నప్పట్నుంచే వీరాభిమానిని. ఆయనతో కలిసి ఒక్కసారైనా తెరపై కనిపించాలనేది నా కల. అది ‘జైలర్‌’తో తీరింది’ అని ఓ సందర్భంలో తెలిపిందీ బ్యూటీ.

‘క్రేజీ ఫెలో’తో 2022లో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’, నాగార్జున ‘నా సామిరంగ’తోనూ ఆకట్టుకుంది.

మలయాళంలో ‘బిగ్‌ బ్రదర్‌’, తమిళంలో ‘బుర్కా’, ‘కలవణి మాపిళ్ళై’ వంటి సినిమాలే కాకుండా ‘అనంతం’ అనే తమిళ వెబ్‌సిరీస్‌లోనూ నటించిందీ బ్యూటీ.

అభిమానుల్ని ఆహా..! అనిపించేలా ఈమె డ్రెస్సింగ్‌ సెన్స్‌ ఉంటుంది. తనదైన డ్రెస్సింగ్‌తో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది. మిర్నా ఇన్‌స్టా ఖాతాను 13లక్షల మంది ఫాలో అవుతున్నారు.

అంతేకాదు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే పాటలకు స్టెప్పులేస్తుంటుంది. ఈమె వీడియోలకు లక్షల్లో లైకులు వస్తాయి.

చీరకట్టు అంటే ఈమెకి మహా ఇష్టం. తరచూ రకరకాల చీరల్లో హొయలొలికిస్తూ వాటిని నెట్టింట షేర్‌ చేస్తోంది.

‘జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకే జిమ్‌లో ఎక్కువ కష్టపడతాను. అప్పుడే కదా ఫిట్‌గా ఉండగలం’ అంటోంది మిర్నా.

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home