ఆషాఢ బోనాలు.. ప్రత్యేకత ఏంటంటే!

బోనం అంటే భోజనం అని అర్థం. ఆషాఢమాసంలో జగన్మాత అయిన తల్లికి భక్తితో సమర్పించే భోజన నైవేద్యాలే బోనాలు.

Source: Eenadu

పాడిపంటలు పుష్కలంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రతి ఇంటిలోనూ సిరులు నిండి ఆయురారోగ్యాలతో విరసిల్లాలని మొక్కుకోవడం ఈ పండగలోని ప్రత్యేకత.

Source: Eenadu

అన్నం, పాలు, పెరుగు, చక్కెర, బెల్లం, పసుపు కలిపి మట్టి కుండ/రాగి పాత్రలో నైవేద్యం వండుతారు.

Source: Eenadu

బోనాల కుండను వేపరెమ్మలు, పసుపు- కుంకుమలతో అలంకరించి దానిపై దీపం పెట్టి.. మహిళలు బోనాలను తలపై పెట్టుకొని ఆలయాలకు తీసుకెళ్తారు.

Source: Eenadu

ఆ తర్వాత రంగం అనే వేడుక జరుగుతుంది. అమ్మవారు పూనిన భక్తురాలు భవిష్యవాణిని వినిపిస్తుంది.

Source: Eenadu

ఆరు వందల ఏళ్ల కిందటి నుంచే తెలంగాణలో బోనాలు ప్రసిద్ధి చెందాయి. గోల్కొండను జయించిన కులీకుతుబ్‌షా కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.

Source: Eenadu

ఆషాఢ మాసం ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని ఒక్కో ఆలయంలో బోనాల సందడి నెలకొంటుంది.

Source: Eenadu

గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక ఆలయంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. గోల్కొండ బోనాలను చెలిమి బోనాలు అంటారు.

Source: Eenadu

తర్వాత వారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ వారం సికింద్రాబాద్‌ అంతటా లష్కర్‌ బోనాలు జరుపుకొంటారు.

Source: Eenadu

అనంతరం లాల్‌ దర్వజా, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సాహం కనిపిస్తుంది. నగరం తర్వాత జిల్లాలలోనూ బోనాల పండుగ నిర్వహిస్తారు.

Source: Eenadu

ఎదుర్కొళ్లు, ఫలహారపు బండ్లు, రంగం, సాగనంపు వంటి అంశాలతో ఈ బోనాల సందడి లాల్‌ దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవంతో పరిసమాప్తమవుతుంది.

Source: Eenadu

ఆషాఢ మాసంలో వర్షాలతో రోగాలు విజృంభిస్తుంటాయి. ఈ సమయంలో పసుపు కలిపిన నీళ్లు, వేపాకులతో చల్లుతూ ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పిస్తారు.

Source: Eenadu

ఈ పనితో గ్రామాల్లో వ్యాధికారక క్రిముల నిర్మూలన జరుగుతుంది. అలాగే వ్యాధినిరోధక శక్తినిచ్చే ఆహారంపై అవగాహన పెంచుకోవడం ఈ ఉత్సవాల ఉద్దేశంగా చెబుతారు.

Source: Eenadu

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home