బాక్సింగ్‌ డే..

మీకివి తెలుసా?

క్రిస్మస్‌ పండగ జరిగిన మరుసటి రోజు (డిసెంబర్‌ 26)న ‘బాక్సింగ్‌ డే’ని చేసుకుంటారు. పేదలకు, క్రిస్మస్‌ రోజున విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఈ రోజున బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.

డిసెంబర్‌ 26ని ‘బాక్సింగ్‌ డే’ అని ఎందుకు అంటారు? ఆ పేరు ఎవరు పెట్టారో ఎవరికీ తెలియదు. అయితే, క్రిస్మస్‌ సందర్భంగా పేదలకు విరాళాలు సేకరించేందుకు చర్చ్‌ల్లో బాక్సులు ఏర్పాటు చేసేవారని ఈ నేపథ్యంలోనే ఆ రోజుకు ఆ పేరు వచ్చిందనే వాదన ఒకటుంది.

సంపన్నులు క్రిస్మస్‌ పండగ రోజును ఘనంగా నిర్వహించుకుని.. ఆ రోజున మిగిలిన ఆహారం, అవసరం లేని వస్తువుల్ని తమ పనివాళ్లకు ఒక బాక్సులో పెట్టి మరుసటి రోజు (బాక్సింగ్‌ డే) ఇస్తుంటారట.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా, యూకేలో ‘బాక్సింగ్‌ డే’ని షాపింగ్‌ డేగా మార్చేశారు. ఈ రోజున అక్కడి ప్రజలు షాపింగ్‌ ఎక్కువ చేస్తారు. దుకాణాలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తాయి.

ఈ రోజున క్రీడా పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా క్రికెట్‌లో ‘బాక్సింగ్‌ డే’ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సెలవు కాబట్టి.. క్రీడాభిమానులు ఇంట్లోనే ఉండి ఆట చూస్తారని ఇలా ప్లాన్‌ చేస్తారు. 

బాక్సింగ్‌ డే పదాన్ని 1983లో ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చేర్చారు. దీనికి సరైన అర్థం తెలియదు. అందుకే, క్రిస్మస్‌ మరుసటి రోజు అని, ఈ రోజున బలహీనవర్గాలు, ఉద్యోగులకు బహుమతులు ఇస్తారని డిక్షనరీలో పేర్కొన్నారు. 

దక్షిణాఫ్రికా ‘బాక్సింగ్‌ డే’ పేరును మార్చుకుంది. అక్కడి ప్రజలు ఈ రోజును ‘ది డే ఆఫ్‌ గుడ్‌విల్‌’గా అభివర్ణించారు.  

డిసెంబర్‌ 26, 2004న హిందూ మహా సముద్రంలో ఏర్పడ్డ సునామీ భారత్‌ సహా చాలా దేశాలను అతలాకుతలం చేసింది. ఈ సునామీ వల్ల దాదాపు 3 లక్షల మంది మరణించినట్లు అంచనా. 

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

Eenadu.net Home