చందనాల బుట్టబొమ్మ 

యూట్యూబ్‌ వెబ్‌సిరీస్‌లతో మొదలుపెట్టి.. వెండితెరపై కూడా మెరుస్తోంది నటి చందన పయ్యావుల. ఇప్పుడు ‘టెనెంట్‌’తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

సోషల్‌మీడియాలోనూ ఈ బ్యూటీకి మాంచి ఫాలోయింగ్‌ ఉంది. ‘డియర్‌ కావ్య’వెబ్‌సిరీస్‌తో మరింత అభిమానుల్ని సంపాదించుకుంది.

చందన హైదరాబాదీనే. స్థానికంగానే డిగ్రీ పూర్తి చేసిన ఈమెకి నటి అవ్వాలని కోరిక. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌, యూట్యూబ్‌లో వీడియోలు చేసేది.

This browser does not support the video element.

ఆ తర్వాత ‘తార’, ‘ఫస్ట్‌ కిస్‌ ఫ్రస్ట్రేషన్‌’, ‘పగలే వెన్నెల’, ‘సీతా పరిణయం’, ‘అమ్మా నాన్న ఓ ప్రేమ కథ’ వంటి వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకుంది.

అనికా సురేంద్రన్‌ నటించిన ‘బుట్ట బొమ్మ’లోనూ నటించి మెప్పించింది. ఈ చిత్రంతోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. 

This browser does not support the video element.

ఈ బ్యూటీకి ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో కలసి ట్రిప్‌ ప్లాన్ చేస్తుంది. బీచ్‌ల్లో ఎంజాయ్‌ చేయడం ఇష్టం.

 సంప్రదాయ దుస్తులు ధరించడమంటే చందనకు బాగా నచ్చుతుంది. లెహంగాలు, చీరలతో సందడి చేస్తుంటుంది.

ఈ బ్యూటీకి క్రికెట్‌ అంటే ఇష్టం. టీవీలో చూడటమే కాదు.. వీకెండ్స్‌లో స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడుతుంది.

This browser does not support the video element.

ఎవరికైనా బోర్‌ కొడితే మూడీగా కూర్చుంటారు. కానీ చందన మాత్రం రీల్స్‌ చేస్తూ సమయాన్ని గడిపేస్తుంటుంది.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home