#eenadu
చాక్లెట్ అనగానే నోరూరుతుంది కదూ..! పిల్లల దగ్గర్నుంచీ పెద్దల వరకూ అందరికీ నచ్చుతుంది. జులై 7 చాక్లెట్ డే. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు.
ఉత్తర అమెరికాలోని దక్షిణ ప్రాంతమైన మెసో అమెరికాలో మొదటిసారిగా చాకో చెట్లను కనుగొన్నారు. ఆ తర్వాత స్థానికులు కోకో బీన్‌లను తినడం, మెడిసిన్‌లో ఉపయోగించడం చేసేవారు.
అలా కనుగొన్న చాకో బీన్లను.. 1728లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్థాపించిన మొదటి చాక్లెట్ ఫ్యాక్టరీలో చాకోబార్‌గా రూపొందించారు.
ఇంతకు ముందు చాక్లెట్‌ను నేరుగా తినేవారు. ఆ తర్వాత పాలను జోడించడం మొదలుపెట్టారు. అలా 1875లో మిల్క్ చాక్లెట్‌ను తయారు చేశారు.
అప్పట్లో కేవలం డబ్బున్న వారి ఇంట్లో మాత్రమే ఇది కనిపించేది. తర్వాత ఉత్పత్తి పెరగడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద చాక్లెట్‌ను 12,000 పౌండ్ల బరవుతో తయారు చేశారు. అంటే దాదాపు 5,400 కిలోలకి పైగానే ఉంటుంది. చాక్లెట్లలో 500 రకాలు ఉన్నాయట.
బార్ తయారు చేయడం తెలియక ముందు కోకో పౌడర్‌ని బేవరేజెస్‌లో ఉపయోగించేవారు. అది కాస్త చేదుగా కొద్దిగా కాఫీ పొడి రుచిని పోలి ఉండేది.
చాక్లెట్‌లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది. దీంతో గుండెజబ్బులు అదుపులోకి వస్తాయి.
2016లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. గర్భిణులు కొంత పరిమాణం మేర చాక్లెట్‌ను రోజూ తీసుకుంటే శిశువు ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.
డార్క్ చాక్లెట్ తినడం వల్ల మధుమేహులకూ మంచే జరుగుతుంది. ఎన్ని ప్రయోజనాలున్నా పరిమితికి మించి తీసుకోకూడదు.