‘కోబ్రా’.. కొన్ని ఆసక్తికర విషయాలు!

విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’. ఆగస్టు 31న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇవిగో..

Image: Twitter

‘కోబ్రా’లో విక్రమ్‌ది గణిత శాస్త్ర ఉపాధ్యాయుడి పాత్ర. ‘నిజ జీవితంలో గణితమంటే భయపడే నేను.. ఇందులో లెక్కల మాస్టారుగా కనిపించాను’ అని విక్రమ్‌ చెప్పాడు.

Image: Twitter

ఈ చిత్రంలో బిషప్‌, రాజకీయ పార్టీ కార్యకర్త, వృద్ధుడు తదితర తొమ్మిదికిపైగా గెటప్స్‌లో విక్రమ్‌ కనిపిస్తాడు.

Image: Twitter

అయితే ఈ సినిమాలో మొత్తం 25 రకాల గెటప్స్‌లో విక్రమ్‌ కనిపిస్తారని సమాచారం. విక్రమ్‌, దర్శకుడు అజయ్‌ దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

Image: Twitter

భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు.

Image: Twitter

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లున్నారు. శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి గోవిందరాజన్‌.

‘కేజీయఫ్‌’ భామ శ్రీనిధి శెట్టికి తొలి తమిళ చిత్రమిది. ఈ సినిమాకి ఎంపిక చేసినప్పుడు ఆమె ఎవరికీ పెద్దగా తెలియదట.

Image: Twitter

‘కోబ్రా’ బడ్జెట్‌ రూ. 90 కోట్లకుపైమాటే అంటున్నారు. విక్రమ్‌ రూ. 25 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు టాక్‌.

Image: Twitter

కోలీవుడ్‌ హిట్‌ చిత్రాలు ‘డిమోంటీ కాలనీ’, ‘అంజలి సి.బి.ఐ’ దర్శకుడు ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Image: Twitter

అక్టోబరు 2019లో మొదలైన ఈ సినిమా సుమారు మూడేళ్ల తర్వాత ఇప్పుడు విడుదలవుతోంది.

Image: Twitter

సోనీ లివ్‌ ఓటీటీతో ‘కోబ్రా’ టీమ్‌ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ విడుదల తేదీపై సమాచారం లేదు.

Image: Twitter

విజయ్‌ సాహిబా రాధికనే!

లుక్కు మార్చి.. అంచనాలు పెంచి!

ఐస్‌క్రీమ్‌.. అర్జిత్‌ సింగ్‌ మ్యూజిక్‌.. ఆల్‌టైమ్‌ ఫేవరెట్స్‌

Eenadu.net Home