డైసీ.. ఖత్రోన్‌ కె ఖిలాడీ!

చాలాకాలం తర్వాత మరోసారి బీటౌన్‌లో అడుగుపెడుతోంది నటి డైసీ షా. 

Image: Instagram/shahdaisy

దర్శకుడు రోహిత్‌ శెట్టి హోస్ట్‌గా ఉన్న బాలీవుడ్‌ రియాల్టీ షో ‘ఖత్రోన్‌ కె ఖిలాడీ’ 13వ సీజన్‌లో డైసీ పాల్గొనబోతోంది.

Image: Instagram/shahdaisy

‘బిగ్‌బాస్‌’లో ఓపిక చాలా అవసరం. అది నాకు లేదు. అదే ‘ఖత్రోన్‌ కె ఖిలాడీ’ అయితే ఛాలెంజింగ్‌ టాస్క్‌లుంటాయి. అవి నాకు చాలా ఇష్టం అందుకే, ఈ షోలో పాల్గొంటున్నట్లు డైసీ తెలిపింది. 

Image: Instagram/shahdaisy

‘జై హో’, ‘హేట్‌ స్టోరీ 3’, ‘రేస్‌ 3’ చిత్రాలతో బాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న డైసీ.. మొదట తెరంగేట్రం చేసింది కోలీవుడ్‌లోనే.

Image: Instagram/shahdaisy

మొదట్లో బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యకు సహాయకురాలిగా పనిచేసిన డైసీ.. 2007లో తమిళ నటుడు జీవ ‘పోరి’లో చిన్న పాత్రలో నటించింది. 

Image: Instagram/shahdaisy

ఆ తర్వాత తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో, అతిథి పాత్రలో నటించి ఆకట్టుకుంది డైసీ. ‘బాడీగార్డ్‌’ కన్నడ రీమేక్‌లో హీరోయిన్‌గా నటించింది.

Image: Instagram/shahdaisy

డైసీ చివరగా 2018లో విడుదలైన ‘రేస్‌ 3’లోనే కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు దూరమైంది.

Image: Instagram/shahdaisy

మరుసటి ఏడాది అంటే 2019లో ‘గుజరాత్‌ 11’ చిత్రంతో గుజరాత్‌ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది. 

Image: Instagram/shahdaisy

గతేడాది ‘దగ్డి చాల్‌ 2’ అనే మరాఠీ చిత్రంలోని ఓ ప్రత్యేక పాటలో ఆడిపాడింది.

Image: Instagram/shahdaisy

కరోనా, కేవలం రెండు సినిమాలే ఒప్పుకోవడం అవీ.. చిత్రీకరణ దశలోనే ఉండటం వల్ల గ్యాప్‌ వచ్చిందని డైసీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

Image: Instagram/shahdaisy

ప్రస్తుతం ఈ ముంబయి బ్యూటీ ‘మిస్టరీ ఆఫ్‌ టాటూ’లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ‘ఖత్రోన్‌ కె ఖిలాడీ’తో బుల్లితెరపై కూడా కనిపించనుంది.

Image: Instagram/shahdaisy

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home