సేంద్రీయ వ్యవసాయంతో తొలి అడుగు వేసిన ఆతిశీ..

ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున దిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ఆతిశీ. ప్రస్తుతం పొలిటికల్‌ పార్టీస్‌లో ఈమె గురించి హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. దిల్లీ నూతన సీఎం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

ఈమె అసలు పేరు ఆతిశీ మర్లేనా. 1981లో జన్మించారు. వీరి కుటుంబంలోని వారంతా విద్యావంతులే తల్లిదండ్రులిద్దరూ ప్రొఫెసర్లు.

ఆతిశీకి మర్లేనా అనే పేరును మధ్యలోనే పెట్టారంట. దానికి కారణం ఆమె తల్లిదండ్రులే. వారికి ఇష్టమైన కార్ల్‌, మార్క్స్‌ పేరును ‘మార్లీనా’గా మార్చి ఆతిశీని అలాగే పిలవడం మొదలుపెట్టారు. 

చిన్నప్పట్నుంచే రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్న ఈమె డిగ్రీలో బీఏని ఎంపిక చేసుకున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో డబుల్‌ ఎం.ఏ పూర్తి చేశారు.

ఆప్‌లో చేరడానికి ముందు ఆతిశీ ఏడేళ్లపాటు మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం, విద్యాభ్యాసంపై పని చేశారు. 

ఎంతో మంది ఎన్‌జీవోలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా జిల్లాలో జరిగిన జల్‌ సత్యాగ్రహ్‌లో పాల్గొన్నారు.

అలా ఆప్‌ సభ్యులతో పరిచయాలు ఏర్పడి.. పార్టీలో సభ్యత్వం తీసుకొన్నారు. 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పట్నుంచీ వివిధ ప్రదేశాల్లో జరిగే క్యాంపైన్‌లలో పాల్గొన్నారు.

2019లో ఆప్‌ తరఫున లోక్‌సభకు ఈస్ట్‌ దిల్లీ నుంచి భాజపా అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌తో పోటీ పడి 4.77 లక్షల ఓట్లతో ఓడిపోయారు.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దక్షిణ దిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌పై బరిలోకి దిగి 11వేల ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. 

స్ఫూర్తి నింపే విషయాలివీ

స్ఫూర్తినింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home