‘దేవర’లో మరాఠీ బ్యూటీ!

ఎన్టీఆర్‌ ‘దేవర’లో మరాఠీ నాయిక శ్రుతి మరాఠే నటించనుంది. దీంతో ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అయిపోయింది. 

‘దేవర’లో శ్రుతి నటించనుందంటూ వార్తలు రాగా... ‘నిజమే.. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇందులో ‘దేవర’కు భార్యగా కనిపిస్తా’ అని సోషల్‌ మీడియాలో చెప్పేసింది.

గుజరాత్‌లో జన్మించిన ఈ బ్యూటీ.. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. మరాఠీలో ‘సనాయ్‌ ఛౌఘడే’తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 

హిందీ, తమిళ, మరాఠీ భాషల్లో వరుస చిత్రాలతో అలరించింది. వెండితెరకు రాక ముందే బుల్లితెరపై సీరియళ్లు, టీవి షోలతో ఫేమసయ్యింది.

‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌’ వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకున్న శ్రుతికి టాలీవుడ్‌లో ‘దేవర’నే మొదటి సినిమా.

This browser does not support the video element.

పండగ రోజుల్లో స్నేహితులతో కలసి శ్రుతి చేసే సందడి... మీరు కచ్చితంగా చూడాల్సిందే. 

విహార యాత్రలను ఎక్కువగా ఇష్టపడే ఈ భామకు బోటింగ్‌ అంటే మక్కువ. షూటింగ్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా కుటుంబంతో ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుందట. 

చీరకట్టు అంటే ఇష్టం... అందులోనూ మరాఠీ స్టైల్‌ ఎర్ర అంచు తెలుపు చీరలు తన ఫేవరెట్‌. ఇన్‌స్టాలో ఆ ఫొటోలు చాలా ఉంటాయి. 

This browser does not support the video element.

ఇంట్లో వాళ్లతో కలసి చేసిన రీల్స్‌ని సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్స్‌ 13 లక్షలు.

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home