చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయా..!

‘వైల్డ్ డాగ్’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ దియా మిర్జా. ఇప్పుడు ‘డంకీ’తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది ఈ భామ.

ఫెమినా మిస్‌ ఇండియా 2000 టైటిల్‌ను గెలుచుకున్న దియా ‘రెహనా హై తేరే దిల్ మే’తో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తర్వాత పలు హిందీ, తమిళ సినిమాల్లో నటించింది. 

‘సవతి తండ్రి ప్రవర్తన నచ్చదు. అయిదేళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయాను. బంధువుల దగ్గరే పెరిగాను. ఆ సమయంలో సక్సెస్‌ఫుల్‌ ఉమన్‌గా మారాలంటే ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాను. రూ. 5వేల జీతానికి మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాను’ అంటుంది దియా. 

మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది.

‘ఓం శాంతి ఓం’, ‘సంజు’, ‘సలామ్‌ ముంబయి’, ‘లవ్‌ బ్రేకప్స్‌ జిందగీ’, ‘క్రేజీ 4’, ‘హమ్‌ తుమ్‌ ఔర్‌ ఘోస్ట్’, ‘లగే రహో మున్నాభాయ్‌’ వంటి 25కు పైగా చిత్రాలతో అలరించింది.

కాలేజీ రోజుల్లోనే పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె.. అప్పట్లోనే గ్రీన్‌ అవార్డును గెలుచుకుంది. 

This browser does not support the video element.

ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. పచ్చటి ప్రకృతిని, వన్యప్రాణుల్ని తన కెమెరాలో బంధిస్తుంటుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఐరాస గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 

This browser does not support the video element.

‘బిడ్డకు జన్మనివ్వగానే తల్లిగా అమితానందంలో తేలియాడతాం. ఆ సంతోషం మనసుని ఓ చోట నిలువనివ్వదు. నాకు అవ్వాన్‌తో గడిపితే సమయమే తెలియదు..’ అంటోంది. తన ఇన్‌స్టా ఖాతాలోనూ వీరిద్దరి వీడియోలే ఎక్కువ.

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

Eenadu.net Home