‘తెర మీద నన్ను చూసుకుంటే సిగ్గేస్తుంది’

‘లోఫర్’తో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ.. సూర్య సరసన ‘కంగువా’తో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

బాలీవుడ్ కథానాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘యోధ’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’లోనూ తనే నాయిక. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

‘ఎం. ఎస్‌ ధోనీ అన్‌టోల్డ్‌ లవ్‌స్టోరీ(2016)’ తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

‘భాఘీ’, ‘భారత్‌’, ‘మలంగ్‌’,‘వార్’ లాంటి సినిమాలతో పాటు ‘కుంగ్ ఫూ యోగా’లో జాకీ చాన్‌తో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 

This browser does not support the video element.

ఫిట్ నెస్ ఫ్రీక్ దిశా తన శరీరాకృతి కోసం జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తుంది. ఆ వీడియోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటుంది.  

ఒత్తిడిలో ఉన్నప్పుడు స్వయంగా స్పానిష్ కాఫీ, కూల్ కాఫీ చేసుకుని తాగుతుంది. అమ్మ చేతి వంటంటే ఇష్టం.

మోడలింగ్‌పై ఆసక్తితో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది దిశా. 2013 లో ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ పోటీల్లో తొలి రన్నరప్‌గా నిలిచింది. ‘ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్‌ విమెన్ 2019’గా మొదటి స్థానంలో నిలిచింది.

పరిశ్రమకు పరిచయమైన నాలుగేళ్లలోనే ఇన్‌స్టాలో దాదాపు 60 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. 

పెంపుడు జంతువులంటే ఈమెకు అభిమానం ఎక్కువే. వాటితో ఉంటే అసలు సమయమే తెలియదు అంటుంది. పాడి పశువులు అంటే చాలా ఇష్టం

‘నేను నటించిన సినిమాలను చూసుకోవడం పెద్దగా నచ్చదు. తెరపై చూసినప్పుడు కళ్లు మూసుకుంటాను. తెరమీద నన్ను చూసుకుంటే సిగ్గేస్తుంది’ అంటుంది దిశా. 

‘పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. సాధించాల్సిన లక్ష్యాలు బోలెడు ఉన్నాయి. జీవితం చాలా చిన్నది.. కనీసం మన పట్ల అయినా మనం నిజాయితీగా లేకపోతే చాలా కోల్పోతాం అనేది నా ఫిలాసఫీ’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home