9 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు..
‘లోఫర్’ (2015)తో దర్శకుడు పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన నటి దిశా పటానీ. తన నటనతో మెప్పించినా ఇక్కడ అవకాశాలు అందుకోలేకపోయారు.
మళ్లీ ఇన్నేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’తో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ నెల 27న మూవీ రిలీజ్ కానుంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఫైట్స్ కూడా చేశారు.
మరో పాన్ ఇండియా మూవీ ‘కంగువ’తోనూ త్వరలోనే వినోదం పంచనున్నారు. సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రమిది.
‘ఎంఎస్ ధోనీ’, ‘బాఘీ 2’, ‘రాధే’,‘యోధ’ వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. జాకీచాన్ చిత్రం ‘కుంగ్ ఫూ యోగా’లో కీ రోల్ ప్లే చేయడం విశేషం.
‘భారత్’ సినిమాలోని పాత్ర కోసం సర్కస్‌లో ట్రైనింగ్ తీసుకుంటుండగా దిశ తలకు గాయమైంది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని నెలలపాటు ఏ విషయాన్నీ గుర్తుపెట్టుకోలేకపోయానని తెలిపారు.
వ్యక్తిగత జీవితమిలా.. బరేలీ (ఉత్తరప్రదేశ్)లో 1992లో జన్మించారు. లఖ్‌నవూలోని ఓ యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌లో చేరిన దిశా సెకండ్ ఇయర్‌తో ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
19 ఏళ్లకే ‘పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఓ ప్రముఖ కంపెనీ యాడ్‌లో నటించి, అందరి దృష్టిని ఆకర్షించారు. అదే సినీ అవకాశాలు తెచ్చిపెట్టింది.
ఆమె తండ్రి జగదీశ్ పటానీ పోలీసు అధికారి. తల్లి హెల్త్ ఇన్‌స్పెక్టర్. తన సోదరి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్.
ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలనేది దిశా డ్రీమ్. ‘‘అమ్మ కాలేజీ రోజుల్లో హీరోయిన్ అవ్వాలనుకుంది. కానీ, ఇంట్లో గ్రీన్ సిగ్నల్ రాలేదు. అమ్మ కల నా రూపంలో నెరవేరింది’’ అని ఓ సందర్భంలో తెలిపారు.
డ్యాన్స్, కిక్ బాక్సింగ్.. ఇలా ఏదో ఒక రూపంలో రోజూ వ్యాయామం చేస్తుంటారు. మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వంటి వాటిల్లోనూ ఈ భామకు ప్రావీణ్యం ఉంది. కారు రిపేరింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నారు.
ఫ్యాషన్ ఐకాన్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 61.3 మిలియన్+.