దిల్‌ దోచేస్తోన్న దివ్యాంశ కౌశిక్‌

నాగ చైతన్య ‘మజిలీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన దివ్యాంశ కౌశిక్‌.. తొలి చిత్రంతోనే కుర్రకారును ఫిదా చేసేసింది.

Source: Instagram/Divyansha Kaushik

తాజాగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో మరోసారి యువతను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

Source: Instagram/Divyansha Kaushik

శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ సరసన ఆడిపాడనుంది.

Source: Instagram/Divyansha Kaushik

1997 ఫిబ్రవరి 10న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో జన్మించిన దివ్యాంశ.. దిల్లీలో పెరిగింది.

Source: Instagram/Divyansha Kaushik

సినిమాలపై ఆసక్తితో ముంబయికి వచ్చి నటనలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత సినీ అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లేది.

Source: Instagram/Divyansha Kaushik

అలా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘మజిలీ’లో అవకాశం దక్కించుకుంది.

Source: Instagram/Divyansha Kaushik

ఇందులో నాగచైతన్య ప్రియురాలు ‘అన్షు’గా నటించింది దివ్యాంశ.

Source: Instagram/Divyansha Kaushik

ఆ సినిమా మంచి విజయం సాధించినా.. ఆఫర్లు మాత్రం ఆలస్యంగానే అందుకుంది.

Source: Instagram/Divyansha Kaushik

ఈ ఏడాదే ‘టక్కరి’ అనే చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిందీ భామ.

Source: Instagram/Divyansha Kaushik

హిందీలో ‘ది వైఫ్‌’అనే చిత్రంతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.

Source: Instagram/Divyansha Kaushik

సమంత అంటే దివ్యాంశకు చాలా ఇష్టం. ఆమె నటించిన ‘ఈగ’ హిందీ అనువాదాన్ని లెక్కలేనన్ని సార్లు చూసిందట.

Source: Instagram/Divyansha Kaushik

బాలీవుడ్‌లో అలియా భట్‌, కరీనా కపూర్‌, అనుష్క శర్మను అభిమానిస్తానని చెప్పుకొచ్చింది.

Source: Instagram/Divyansha Kaushik

మంచి కథ ఉన్న చిత్రాలతోపాటు గ్లామర్‌ పాత్రల్లో నటించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఓ సందర్భంలో దివ్యాంశ వెల్లడించింది.

Source: Instagram/Divyansha Kaushik

అందం.. అభినయంతో మెప్పించే సత్తా ఉన్న ఈ కుర్ర హీరోయిన్‌కు ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులున్నాయి.

Source: Instagram/Divyansha Kaushik

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home