ఈ సారి అన్నీ ‘డబుల్‌’.. ‘ఇస్మార్ట్‌’ సంగతులివీ

#Eenadu

రామ్‌- పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌ ఇది. 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

తొలి భాగం ఊహించని విజయాన్ని అందివ్వడంతో రెండో భాగాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

పార్ట్‌ 1లో ఉన్నట్టే ఇందులోనూ హీరో మెదడులో చిప్‌ ఉండడం కామన్‌ పాయింట్‌. కానీ, ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌ స్టోరీనే స్పెషల్‌ అంటున్నారు పూరి.

కథానాయడి పాత్ర యాటిట్యూడ్‌, యాక్షన్‌, ఫన్‌.. పేరు తగ్గట్టే అన్నీ ‘డబుల్‌’ అని టీమ్‌ తెలిపింది. ట్రైలర్‌ను చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. 

తొలి భాగంలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా ఇందులో కావ్యా థాపర్‌ ఒక్కరే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కోసం ఈమె ఆడిషన్‌ ఇచ్చినా ఛాన్స్‌ రాలేదట. సీక్వెల్‌లో దక్కింది.

సంజయ్‌ దత్‌ విలన్‌ రోల్‌ ప్లే చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణ. బిగ్‌ బుల్‌గా ఆయన కనిపించనున్నారు. సంజయ్‌కు పూర్తి స్థాయి తొలి తెలుగు చిత్రమిదే. (చంద్రలేఖలో గెస్ట్‌ రోల్‌ చేశారు)

ఒకట్రెండు మినహా పూరి తెరకెక్కించిన చిత్రాలన్నింటిలో అలీ నటించడం విశేషం. డైరెక్టర్‌ 15 ఏళ్ల క్రితమే రాసుకున్న ఓ కామెడీ రోల్‌ను ఇందులో ప్లే చేశారు అలీ. 

విజయవంతమైన చిత్రానికి సీక్వెల్‌ అనగానే సంగీతంపైనా ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. వాటికి తగ్గట్టే పాటలు అందించారు మణిశర్మ. 

ఇస్మార్ట్‌ శంకర్‌లాంటి పాత్ర పోషించే అవకాశం కెరీర్‌లో ఎప్పుడో గానీ రాదని రామ్‌ అన్నారు. ‘స్కంద’ కోసం బరువు పెరిగిన ఈ హీరో ఈ సినిమా కోసం నెలలోనే 18 కేజీలు తగ్గారు.

టాలీవుడ్‌లో వేగంగా కథలు రాయడమే కాకుండా తెరకెక్కించే దర్శకుడిగా పూరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సీక్వెల్‌ కోసమే ఆయన ఎక్కువ సమయం తీసుకున్నారట.

ఓ ఫ్లాప్‌ సినిమా తర్వాత చేస్తున్నది కావడంతో ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను రూపొందించానని డైరెక్టర్‌ చెప్పడం గమనార్హం.

వేసవిలోనే రిలీజ్‌ చేయాలని భావించినా అది సాధ్యపడలేదు. ఆగస్టు 15న రావాల్సిన ‘పుష్ప 2’ వాయిదా పడడంతో ఆ డేట్‌ని లాక్‌ చేసుకుంది ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ బృందం. 

ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను రూ. 60 కోట్లకు విక్రయించారు. రామ్‌ కెరీర్‌లోనే బిగ్‌ డీల్‌ ఇది. ఓటీటీ రైట్స్‌ను ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ రూ. 33 కోట్లకు దక్కించుకుంది.

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home