దృశ్యం.. ఆరు రీమేక్‌లు.. అరుదైన రికార్డులు..

#drishyam

మలయాళంలో రూ.5 కోట్లతో నిర్మించిన ‘దృశ్యం’ రూ.75 కోట్లు వసూలు చేసింది.

కన్నడలో ‘దృశ్య’ పేరుతో పి.వాసు దర్శకత్వంలో రవిచంద్రన్‌ కథానాయకుడిగా రీమేక్‌ చేశారు.

తెలుగులో వెంకటేశ్‌, మీనా జంటగా శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తమిళంలో ‘పాపనాశం’ పేరుతో రాగా, ఇందులో కమల్‌హాసన్‌ నటించారు.


హిందీలో ‘దృశ్యం’అజయ్‌ దేవగణ్‌ చేశారు. నిశికాంత్‌ కామత్‌ దర్శకుడు.

శ్రీలంకలో ‘ధర్మాయుద్ధాయ’ పేరుతో ఈ చిత్రం రీమేక్‌ అయింది.

చైనీస్‌లో ‘షీప్‌ విత్‌ అవుట్‌ ఏ షెపర్డ్‌’ పేరుతో రీమేక్‌ అయిన తొలి ఇండియన్‌ సినిమా.

ఇండోనేసియా, కొరియాలోనూ రీమేక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

దృశ్యం (మలయాళం) తమిళనాడు, ముంబయి, బెంగళూరు, యూఏఈల్లో 100 రోజులకు పైగా ఆడింది. 

యూఏఈలో 100 రోజులు ఆడిన తొలి భారతీయ సినిమా.

కేరళలో 20వేలకు పైగా షోలు ప్రదర్శితమైన తొలి మలయాళీ చిత్రం.

‘దృశ్యం’(మలయాళం)లో చిన్న కుమార్తెగా కనిపించిన ఎస్తర్‌ అనిల్‌ తెలుగు, తమిళ భాషల్లోనూ నటించారు.

మోహన్‌లాల్‌ పక్కన నయనతారను అనుకున్నారు. డేట్స్‌ కుదరక మీనా వచ్చి చేరారు.

ఖుషి కపూర్‌ ‘స్కూల్‌డేస్‌’ మెమొరీస్‌.. సింపుల్‌గా నేహా

క్రెడిట్‌ కార్డుతో ఈ తప్పులు చేయొద్దు!

₹250 నుంచే సిప్‌.. వివరాలు ఇవీ..!

Eenadu.net Home