సెకండ్‌ ఇన్నింగ్స్‌ షురూనా?

టాలీవుడ్‌లో ‘ప్రేమ కావాలి’తో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును ప్రేమలో పడేసిన ఇషా చావ్లా.. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనుంది.

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో త్రిష ప్రధాన నాయిక కాగా... సురభి, ఇషా కూడా నటిస్తున్నారని టాక్‌.

దిల్లీలో పుట్టి మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఈ భామ నటనపై ఆసక్తితో 2011లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

తెలుగులో ‘ప్రేమ కావాలి’, ‘పూల రంగడు’, ‘శ్రీమన్నారాయణ’, ‘మిస్టర్‌ పెళ్లికొడుకు’, ‘జంప్‌ జిలాని’ చిత్రాలతో అలరించింది.

అవకాశాలు తగ్గాయా, బ్రేకే తీసుకుందో కానీ... గత పదేళ్లుగా తెలుగు సినిమావైపు మళ్లీ చూడలేదు.

This browser does not support the video element.

ఫిట్‌గా ఉండేందుకు ఇషా రోజూ డ్యాన్స్‌ చేస్తుందట. అదే తన హాబీ అని చెబుతుంది. 

‘సాంబార్‌, చికెన్‌ కర్రీ అంటే ఎంతో ఇష్టం. మహేష్‌బాబు, కాజల్‌ అగర్వాల్‌కు వీరాభిమానిని’ అంటోంది ఇషా.

ఒత్తిడిగా అనిపించినప్పుడల్లా విహార యాత్రలు ప్లాన్‌ చేస్తుంది. లండన్‌, గోవా తన ఫేవరెట్‌ స్పాట్స్‌. 

ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, క్యాష్‌, ఉగాది ఈవెంట్‌కు గెస్ట్‌గా విచ్చేసింది.

ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది అని పుకార్లు వచ్చినా... ఎక్కడా స్ఫష్టత రాలేదు. దీంతో ‘విశ్వంభర’తో సెకండ్‌ ఇన్నింగ్స్ షురూ అనొచ్చు.

This browser does not support the video element.

ధోనీకి వీరాభిమాని. మాహీ కోసమే ఐపీఎల్‌ ఫైనల్‌ చూడటానికి వెళ్లింది. ఆ ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసింది.

ఈమెకి పింక్‌ కలర్‌ అంటే ఇష్టం. ఇన్‌స్టాలోనూ ఎక్కువగా ఈ రంగు దుస్తుల్లో ఉన్న ఫొటోలే ఉంటాయి.

This browser does not support the video element.

ఆక్వా బ్యూటీ.. బీచ్‌లో ఆడుకోవడం అంటే ఇషాకి ఇష్టం. అలల్ని చూస్తూ కూర్చుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని చెబుతుంది.

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home