మస్తుంది.. ఎస్తర్‌!

ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’షో తాజా ఎపిసోడ్‌లో నటి ఎస్తర్‌ నోరోన్హా డ్యాన్స్‌ ఫెర్ఫార్మెన్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఆ ఎపిసోడ్‌కి ఆ డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

Image: Instagram/esternoronha

‘1000 అబద్ధాలు’తో టాలీవుడ్‌కు పరిచయమైన ఎస్తర్‌.. ప్రస్తుతం తెలుగుతోపాటు, తమిళ్‌, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది.

Image: Instagram/esternoronha

బహ్రెయిన్‌లో జన్మించిన ఈ బ్యూటీ.. భారత్‌లోని గోవాలో పెరిగింది. ఎనిమిదేళ్ల వయసులోనే కొంకణి భాష మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నటించింది. 

Image: Instagram/esternoronha

ఆ తర్వాత ముంబయికి వెళ్లి.. పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ సైకాలజీలో డిగ్రీ చేసింది. 

Image: Instagram/esternoronha

నటనపై ఆసక్తితో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. అలా బాలీవుడ్‌లో ‘బారోమస్‌(2012)’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Image: Instagram/esternoronha

బీటౌన్‌లో ఎస్తర్‌ను చూసిన దర్శకుడు తేజ.. ‘1000 అబద్ధాలు’లో అవకాశమిచ్చారు. ఆ తర్వాత ఈమె ‘భీమవరం బుల్లోడు’, ‘జయ జానకి నాయక’, ‘ఐరావతం’ తదితర చిత్రాల్లో నటించింది. 

Image: Instagram/esternoronha

హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ భామ.. కొంకణి, తుళు, మరాఠీ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

Image: Instagram/esternoronha

సినిమాల్లోనే కాదు.. వెబ్‌సిరీస్‌లోనూ కనిపించి ఆకట్టుకుంది. గతేడాది జీ5లో విడుదలైన వెబ్‌సిరీస్‌ ‘రెక్కీ’లో ఎస్తర్‌ నటించింది.

Image: Instagram/esternoronha

ఎస్తర్‌.. 2019లో తెలుగు సింగర్‌, ర్యాపర్‌ నోయెల్‌ను వివాహం చేసుకుంది. మనస్పర్థలు రావడంతో మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నారు.

Image: Instagram/esternoronha

ఎప్పుడూ గ్లామర్‌ పాత్రల్లో మెరిసే ఎస్తర్‌.. తన తాజా చిత్రం ‘శక్తి’లో భిన్నంగా కనిపించింది. తెలుగింటి ఇల్లాలిగా.. శక్తిమంతమైన పాత్ర పోషించింది.

Image: Instagram/esternoronha 

ఓవైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు బ్యూటీ సెలూన్స్‌, బోటిక్స్‌ నిర్వహిస్తూ వ్యాపారవేత్తగా రాణిస్తోంది.

Image: Instagram/esternoronha

‘కేన్స్‌’లో మెరిసిన మన తారలు

ఈ క్యూట్ సిస్టర్స్‌.. చాలా హాట్‌ గురూ...!

మోహన రంగ.. అందం అదిరిందిగా

Eenadu.net Home