‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటోన్న ఫరియా
నవీన్ పొలిశెట్టి ‘జాతి రత్నాలు’తో వెండితెరకు పరిచయమైంది నటి.. ఫరియా అబ్దుల్లా. చిట్టిగా తొలి సినిమాతోనే యూత్‌లో క్రేజ్ సంపాదించింది.
చిట్టి ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్లయింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. టాలీవుడ్‌లో ఫాలోయింగ్ ఎక్కువే..
ఈ బ్యూటీ మరోసారి కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది.. అదే ‘ఆ ఒక్కటీ అడక్కు’. అల్లరి నరేశ్ హీరోగా దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమిది. త్వరలో విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఫరియా హైట్ ఎక్కువ.. అల్లరి నరేశ్ కూడా పొడగరి కావడంతో జోడీ బాగుందని నెటిజన్లు అంటున్నారు.
జాతి రత్నాలు తర్వాత ఈ భామ.. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో అతిథి పాత్రలో, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’లోని ఓ ప్రత్యేక పాటలో మెరిసింది.
అటు అఖిల్, ఇటు నాగార్జున, నాగ చైతన్య ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో ఫరియా కలిసి నటించడం విశేషం.
ఆ తర్వాత ‘లైక్, షేర్ & సబ్‌స్క్రయిబ్’, ‘రావణాసుర’లో హీరోయిన్‌గా కనిపించిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఇటీవల ‘ది జెంగబురు కర్స్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించి మెప్పించింది.
ప్రస్తుతం చిట్టి.. తెలుగులో ‘భగవంతుడు’, తమిళ్‌లో ‘వల్లి మాయిల్’లో నటిస్తోంది. మరోవైపు షాప్స్ ప్రారంభోత్సవాలు, ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తోంది.
ఈ హైదరాబాదీ భామ.. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్. తరచూ తన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందుకే.. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటోంది.
ఇటీవల దుబాయిలో జరిగిన ‘గామా’అవార్డు వేడుకల్లో ఎరుపు రంగు దుస్తుల్లో హొయలొలికింది. పలు మోడలింగ్ దుస్తుల్లోనూ ఫొటోషూట్స్‌లో పాల్గొంటోంది.
This browser does not support the video element.
ఫరియాకి డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. డ్యాన్స్ స్టూడియోలో నృత్యాలు చేస్తూ ఆ వీడియోలను కూడా సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటుంది.