ఫిఫా వరల్డ్ కప్.. మీకివి తెలుసా?
ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న ఫిఫా వరల్డ్‌కప్ - 2022కు సర్వం సిద్ధమైంది. ఖతర్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..
Image: RKC
అరబ్‌దేశాల్లో ఫిఫా వరల్డ్‌కప్ జరగడం ఇదే తొలిసారి. ఆసియా ఖండంలో రెండోసారి. ఇది వరకు(2002లో) జపాన్, దక్షిణా కొరియా సంయుక్తంగా టోర్నీని నిర్వహించాయి.
Image: Pixabay
ఖతర్.. ఈ వరల్డ్ కప్ నిర్వహణ కోసం 200బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. కొత్తగా ఏడు స్టేడియాలు, రహదారులు, హోటల్స్ నిర్మించింది.
Image: RKC
సాధారణంగా ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీల్ని మే-జులై మధ్యలో నిర్వహిస్తుంటారు. కానీ, ఈసారి శీతాకాలంలో నిర్వహిస్తున్నారు.
Image: RKC
ఖతర్ ఏడారి ప్రాంతం కావడంతో వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే టోర్నీ షెడ్యూల్‌ను శీతాకాలానికి మార్చారు. ఫిఫా చరిత్రలో తొలి శీతాకాలపు టోర్నీగా చెప్పొచ్చు.
Image: Pixabay
ఖతర్‌లో శీతాకాలంలోనూ పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుంది. ఆటగాళ్లు, ప్రేక్షకులు ఇబ్బంది పడకూడదని.. ఏకంగా స్టేడియాల్లో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు.
Image: RKC
ఈ పోటీల్లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. ఎనిమిది స్టేడియాల్లో 64 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Image: RKC
ఫిఫా వరల్డ్‌కప్ షెడ్యూల్ సాధారణంగా నెలకుపైగా ఉంటుంది. కానీ, ఈ సారి 28 రోజుల్లోనే ముగియనుంది. అతి తక్కువ రోజుల్లో టోర్నీని నిర్వహించడం ఇదే తొలిసారి.
Image: RKC
ఫిఫా తొలి ప్రపంచకప్ పోటీలు 1930లో ఉరుగ్వే వేదికగా జరిగాయి. రెండో ప్రపంచయుద్ధం సమయం మినహాయిస్తే.. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ పోటీలు జరుగుతున్నాయి.
Image: RKC
గత ప్రపంచకప్(2018)లో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో క్రొయేషియాను 4-2 తేడాతో ఓడించి కప్ గెలుచుకుంది.
Image: Twitter/french football
ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ పోటీల్లో బ్రెజిల్ 5, జర్మనీ 4, ఇటలీ 4, అర్జెంటీనా 2, ఫ్రాన్స్ 2, ఉరుగ్వే 2, స్పెయిన్ 1, ఇంగ్లాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి.
Image: Pixabay