ఎఫ్‌1 కారు.. భలే జోరు!

ఎఫ్‌1 రేస్‌లో వినియోగించే కారు తయారీకి దాదాపు 10 నుంచి 20 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు(రూ. 81కోట్ల నుంచి రూ. 162కోట్లు) ఖర్చు అవుతుందట. ఒక్కో కారు బరువు 700 కిలోలకుపైగా ఉంటుంది.

Image: RKC

ఒక కారులో 80 వేల విడి భాగాలుంటాయి. వాటన్నింటినీ సమగ్రంగా, జాగ్రత్తగా ఫిట్‌ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి సరిగా లేకపోయినా కారు ప్రమాదంలో పడ్డట్లే.

Image: RKC

కారు స్టార్ట్‌ చేసిన క్షణంలోనే గంటకు 160కి.మీ వేగాన్ని అందుకుంటుంది. బ్రేక్‌ వేసినప్పుడు 4 సెకండ్లలో మళ్లీ వేగం సున్నాకు చేరుకోవడం విశేషం.

Image: RKC 

కారు బ్రేక్‌ వేసినప్పుడు బ్రేక్‌ డిస్క్‌ల రాపిడికి 1000 డిగ్రీల సెల్సియస్‌ వేడి ఉత్పన్నమవుతుంది. 

Image: RKC

ఎఫ్‌1 రేస్‌ కారు ఇంజిన్‌ చల్లగా ఉంటే పనిచేయదట. అందుకే, రేస్‌కు ముందే కారుని స్టార్ట్‌ చేసి ఇంజిన్‌ వేడెక్కెలా చేస్తారు. ఆ వేడి కొనసాగేలా కారుకు అదనంగా హీట్‌ పంప్స్‌, గేర్‌ బాక్స్‌ను అమరుస్తారు.  

Image: RKC

ఒక్క కారు ఇంజిన్‌ గరిష్ఠంగా ఐదు రేసులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దాని సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి రేస్‌కు పనికిరాదు.

Image: RKC

ఎఫ్‌1 రేస్‌ కారు టైర్లు ఒక్క రేసుకు అరకిలో బరువు తగ్గుతాయట. అత్యధిక వేగంతో పయనించడం, హార్డ్‌ బ్రేకింగ్‌ వల్ల టైర్లు తొందరగా అరిగిపోతాయి.

Image: RKC

కారు స్టీరింగ్‌పై 20కిపైగా బటన్స్‌ ఉంటాయి. గంటకు వందల కి.మీ వేగంతో ప్రయాణిస్తూ.. ఆ బటన్స్‌ను అవసరానికి అనుగుణంగా ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారట.

Image: RKC

ఎఫ్‌1 రేస్‌లో పాల్గొన్న డ్రైవర్లు దాదాపు 3 లీటర్లకు సమానమైన శరీర ద్రవాలను కోల్పోతారు. అందుకే, హెల్మెట్‌లోనే ‘వాటర్‌ పౌచ్‌’ను ఏర్పాటు చేస్తారు. డ్రైవింగ్‌ చేస్తూనే మీట నొక్కి పౌచ్‌లోని నీరు తాగొచ్చు.

Image: RKC

ఒక్క రేసుకు కారు డ్రైవర్‌ 1.8 కిలోల బరువు తగ్గుతారట. కాక్‌పిట్‌లో ఉత్పన్నమయ్యే వేడే దీనికి ప్రధాన కారణం. 

Image: RKC

ఈ రేసులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే, డ్రైవర్ల రక్షణ కోసం వారు ధరించే హెల్మెట్‌లను దృఢంగా తయారు చేస్తారు. ప్రపంచంలో అత్యంత దృఢంగా ఉండే హెల్మెట్లు ఇవే. 

Image: RKC

ఎఫ్‌1 రేసులో పాల్గొన్న తొలి భారతీయ రేసర్‌.. నరైన్‌ కార్తికేయన్‌. అనేక సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొన్నారు.

Image: RKC

ఫుట్‌బాల్‌.. మీకివి తెలుసా!

దేశవాళీ.. లిస్ట్‌-ఏ.. టాప్‌ 10 బ్యాటర్లు!

టీ20ల్లో హ్యాట్రిక్‌ వికెట్ విశేషాలు!

Eenadu.net Home