చండీగఢ్‌ కా బ్యూటీ.. వామికా గబ్బీ!

బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ ఐఫోన్‌తో ‘ఫుర్సత్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ తీశారు. ఇందులో హీరోయిన్‌గా వామికా గబ్బీ నటించింది. తాజాగా ‘జూబ్లీ’ వెబ్‌సిరీస్‌లోనూ మెరిసింది. 

Image: Instagram/Wamiqa Gabbi

సాధారణంగా హీరోయిన్‌గా ఎదుగుతోన్న నటీమణులు షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించడానికి ఇష్టపడరు. కానీ, వామికా ఒప్పుకొని నటించడం విశేషం.

Image: Instagram/Wamiqa Gabbi

ఈ భామ.. హిందీ చిత్రాలతోపాటు పంజాబీ, మలయాళం, తమిళ్‌ చిత్రాల్లోనూ నటిస్తోంది. తెలుగులో ‘భలే మంచి రోజు’లో మెరిసింది.

Image: Instagram/Wamiqa Gabbi

వామికా.. 1993 సెప్టెంబర్‌ 29న చండీగఢ్‌లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. టీనేజీలోనే సినిమాల్లోకి వచ్చేసింది.

Image: Instagram/Wamiqa Gabbi

‘జబ్‌ వి మీట్‌’లో వెండితెరకు పరిచయమైంది. ‘సిక్స్‌టీన్‌’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తళుక్కుమంది.

Image: Instagram/Wamiqa Gabbi

ఎక్కువగా హిందీ, పంజాబీ సినిమాల్లో నటించే వామికా.. పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది.

Image: Instagram/Wamiqa Gabbi

ఓటీటీలోనూ ‘గ్రహణ్‌’, ‘మయ్‌’, ‘మోడ్రన్‌ లవ్‌: ముంబయి’ వంటి వెబ్‌సిరీస్‌లోనూ నటించి వావ్‌ అనిపించింది. 

Image: Instagram/Wamiqa Gabbi

కథక్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్న వామికాకు ఐశ్వర్యరాయ్‌, హృతిక్‌రోషన్‌ డ్యాన్సింగ్‌ స్టైల్‌ అంటే చాలా ఇష్టమట. 

Image: Instagram/Wamiqa Gabbi

‘ఫుర్సత్‌’లో వామికా కాంటెంపరరీ డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది. తనకు రాని ఈ డ్యాన్స్‌ఫామ్‌ను కేవలం తొమ్మిది రోజుల్లోనే నేర్చుకొని చేసిందట. 

Image: Instagram/Wamiqa Gabbi

ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు పంజాబీ, ఒక హిందీ, ఒక మలయాళీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. 

Image: Instagram/Wamiqa Gabbi

వామికా జంతుప్రేమికురాలు.. అందుకే, న్యాయశాస్త్రం చదివిన ఈ భామ.. యానిమల్ రైట్స్‌కు మద్దతుగా నిలుస్తోంది. వీధికుక్కలను దత్తత తీసుకోవాలని ప్రచారం చేస్తుంటుంది.

Image: Instagram/Wamiqa Gabbi

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home