జీ7 సదస్సు.. విశేషాలివీ!
ప్రపంచ ఆర్థిక, చమురు సంక్షోభం.. గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) ఏర్పాటుకు కారణమైంది. 1975లో జీ7 ఏర్పాటు జరిగింది.
అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ దీనిలో సభ్యదేశాలు. ప్రస్తుతం ఐరోపా సమాఖ్య (ఈయూ) కూడా సభ్యదేశంగా కొనసాగుతోంది. రష్యా, చైనాలకు సభ్యత్వం లేదు.
ఆయా దేశాల ఉమ్మడి ప్రయోజనాల అంశాలపై చర్చించేందుకు ఏటా సభ్యదేశాలు సమావేశమవుతుంటాయి. ప్రతి సభ్య దేశమూ.. ఒక్కో ఏడాది జీ7 అధ్యక్ష బాధ్యతను చేపడుతుంది. ఆ దేశం రెండు రోజుల పాటు శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది.
ఈ సారి 50వ జీ7 సమ్మిట్‌కు ఇటలీ వేదిక. ఈ నెల 13 - 15 తేదీల్లో సమావేశాలు జరుగుతున్నాయి.
Image:G7summit
జీ7లో మన దేశానికి సభ్యత్వం లేదు. ఇటలీ ఆహ్వానంపై భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరయ్యారు.
ఈ శిఖరాగ్ర సమావేశంలో భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొన్నాయి.
ఉద్ధృతమవుతున్న ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్ సంఘర్షణ గురించి ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్‌లతో పాటు జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తదితర అగ్రనేతలు హాజరయ్యారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా హాజరై తమ దేశంపై రష్యా చేస్తోన్న దాడి గురించి సమావేశంలో మాట్లాడారు.