గాలోడి జోడీ.. గెహనా సిప్పీ!
ఆకాశ్ పూరి ‘చోర్ బజార్’తో వెండితెరకు పరిచయమైంది నటి గెహనా సిప్పీ. తాజాగా ఆమె మరో తెలుగు చిత్రంలో కనిపించనుంది.
Image: Instagram
సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గాలోడు’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
Image: Instagram
గెహనా ముంబయిలో 2000 అక్టోబర్ 11న జన్మించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండేదట. దీంతో సినిమాలు చూస్తూ నటనలో మెళకువలు నేర్చుకుంది.
Image: Instagram
ముంబయిలో చదువుకుంటూనే పలు ప్రచార చిత్రాల్లో నటించింది గెహనా. డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యముంది.
Image: Instagram
ఈ యంగ్ హీరోయిన్‌కి టాలీవుడ్ సినిమాలంటే చాలా ఇష్టమట. దేశముదురు, పోకిరి సినిమాలతో మొదలుపెట్టి.. చాలా తెలుగు సినిమాలు చూసిందట.
Image: Instagram
అలా తెలుగుపై ప్రేమతో టాలీవుడ్‌లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చేసింది. తెలుగు మాట్లాడటమూ నేర్చుకుంది.
Image: Instagram
పార్ట్ టైమ్‌గా డ్యాన్స్ నేర్పిస్తూ.. ఆడిషన్స్‌లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ‘చోర్ బజార్’లో ఎంపికై హీరోయిన్‌గా మారింది.
Image: Instagram
టాలీవుడ్ చిత్రాల్లో ‘మహానటి’, ‘ఫిదా’ తనకు బాగా నచ్చాయని గెహనా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Image: Instagram
హీరోయిన్లలో సాయి పల్లవి, హీరోల్లో రామ్ చరణ్ అంటే గెహనాకు అభిమానం.
Image: Instagram
సినిమాలో అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందంట. కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ‘గాలోడు’ చిత్రీకరణలో ఉండగా. మరికొన్ని ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది గెహనా.
Image: Instagram
ఇన్‌స్టాలో ఈ భామ చాలా యాక్టివ్. తన సినీ విశేషాలతోపాటు.. హాట్ ఫొటోలను పోస్టు చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
Image: Instagram