‘జెంటిల్ మేన్ 2’ లో ఈమే నాయిక..
అర్జున్, శంకర్ కాంబోలో వచ్చిన ‘జెంటిల్ మేన్’కు సీక్వెల్ గా ‘ జెంటిల్‌మేన్ 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో నటించే అందాల హీరోయిన్ ప్రాచీ తెహ్లాన్.
‘బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమాలో నా పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా’ అని ప్రాచీ తెలిపింది.
‘త్రిశంకు’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇందులోని ఓ పాటను రానా దగ్గుబాటి విడుదల చేశాడు.
ప్రాచీ.. జాతీయస్థాయి క్రీడాకారిణి. చిన్న వయసు నుంచే క్రీడల్లో రాణిస్తూ బాస్కెట్ బాల్, నెట్ బాల్ విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఎన్నో పతకాలు అందుకుంది.
ఈ బ్యూటీ 2011 లో జరిగిన నేషనల్ గేమ్స్ లో నెట్ బాల్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. 2010 యూత్ ఏషియన్ ఛాంపియన్ షిప్ లో నెట్ బాల్ టీమ్‌కు కెప్టెన్.
2016 లో ‘దియా ఔర్ బాతీ హమ్ ’ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇక్యావన్’ ‘బ్యాండ్ బాజా బంద్ దర్వాజా’ తో ఆకట్టుకుంది.
పంజాబీ ‘బెలారస్’ లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మలయాళీ ‘మామంగం’ తో అలరించింది.
దిల్లీలో పుట్టి పెరిగిన ఈ సుందరి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేసి తర్వాత ఎంబీఏ పట్టా అందుకుంది.
డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, డెలాయిట్, అసెంచర్, 1800 స్పోర్ట్స్, తదితర కంపెనీల్లో ఉద్యోగం చేసింది. జమ్ముకశ్మీర్‌లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగమైంది.
‘జెంటిల్ మేన్ 2 ’ లాంటి భారీ ప్రాజెక్ట్‌లోనే కాదు.. మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ తోనూ నటిస్తోంది. ఆయన కొత్త చిత్రం ‘రామ్’లోనూ తనే నాయిక.
ప్రాచీ అభిమాన నటుల సంఖ్య చాలా ఎక్కువే. అందులో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, బొమన్ ఇరానీ, జులియా రాబర్ట్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ ఉన్నారు.
పుస్తకాలు చదవడం, విహారయాత్రలకు వెళ్లడమంటే ప్రాచీకి ఇష్టం. గోవా, దుబాయ్, యూరప్ తనకిష్టమైన ప్రదేశాలు.