‘ఘోస్ట్’కి జోడీ.. ఈ బ్యూటిఫుల్ లేడీ!
కింగ్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ దసరా సందర్భంగా విడుదలైంది. ఇందులో నాగ్‌కు జోడీగా నార్త్ బ్యూటీ సోనాల్ చౌహన్ నటించింది.
Image: Instagram
ఇందులో సోనాల్.. ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్ర పోషించింది. నాగ్‌తోపాటు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇలాంటి పాత్ర చేయడం ఆమెకు ఇదే తొలిసారి.
Image: Instagram
పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడానికి సోనాల్ ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలో ఎం.ఎం.ఎలో కూడా శిక్షణ పొందిందట. అన్ని ఆయుధాల గురించి తెలుసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. Image: Instagram
సినిమాలో తన పాత్ర కోసం శిక్షణ తీసుకుంటుండగా సోనాల్ కాలు వేలు ఫ్రాక్చర్ అయింది. దీంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంది.
Image: Instagram
సోనాల్ చౌహన్ రాజ్‌పూత్ కుటుంబంలో జన్మించింది. నోయిడాలోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యనభ్యసించింది. న్యూ దిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలాసఫీ హానర్స్ చదివింది.
Image: Instagram
మిస్ వరల్డ్ టూరిజం 2005 కిరిటాన్ని గెలుచుకుంది. మిస్ వరల్డ్ టూరిజం కిరిటాన్ని సొంతం చేసుకున్న మొదటి భారతీయురాలు ఈమెనే.
Image: Instagram
తెలుగులో 2008లో విడుదలైన ‘రెయిన్ బో’తో టాలీవుడ్‌కి ‘జన్నత్’తో బాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
Image: Instagram
చాలా కాలం తర్వాత 2014లో బాలకృష్ణ ‘లెజెండ్’తో మళ్లీ తెలుగుతెరపై మెరిసింది సోనాల్. బాలయ్యతో ‘డిక్టేటర్’, ‘రూలర్’లోనూ నటించి హ్యాట్రిక్ కొట్టింది.
Image: Instagram
‘పండగ చేస్కో’, ‘షేర్’లో హీరోయిన్‌గా నటించిన ఈ భామ.. ‘ఎఫ్ 3’లో కీలక పాత్రలో నటించింది. నిడివి తక్కువే అయినా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
Image: Instagram
ప్రభాస్ ‘ఆదిపురుష్’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.. సోనాల్. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.
Image: Instagram
తన అందానికి, ఆరోగ్యానికి యోగానే ముఖ్య కారణమని చెబుతోంది. క్రమం తప్పకుండా రోజూ యోగాసనాలు వేస్తుందట.
Image: Instagram
సోనాల్‌కి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. కానీ, వివాహ వేడుకను మాత్రం సాగర తీరం లేదా కొండ ప్రాంతంలో చేసుకోవాలని తన కోరికట.
Image: Instagram
సోనాల్ చౌహన్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామని 4.4 మిలియన్ల నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
Image: Instagram