‘మహా’ అందం.. హన్సిక సొంతం

2003లో బాలనటిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన హన్సిక ‘దేశ ముదురు’తో 2007లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Source: Instagram/Hansika Motwani 

తొలి సినిమాతోనే యువతను ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ప్రేమ కథల్లో నటిస్తూ యువకుల కలల రాణిగా మారింది. 

Source: Instagram/Hansika Motwani

ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా ‘మహా’. శింబూ కీలక భూమిక పోషించారు. ఈ చిత్రాన్ని జులై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Source: Instagram/Hansika Motwani 

ఈమె పూర్తి పేరు హన్సిక మెత్వానీ. 1991 ఆగస్టు 9న ముంబయిలో జన్మించింది.

Source: Instagram/Hansika Motwani 

హన్సిక తండ్రి ప్రదీప్ వ్యాపారవేత్త కాగా.. తల్లి మోనా డెర్మటాలజిస్ట్.

Source: Instagram/Hansika Motwani 

ఈమె పలు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పేద పిల్లల విద్య, రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

Source: Instagram/Hansika Motwani

2014లో ఫోర్బ్స్ 250 మంది ప్రముఖుల జాబితాలో చోటు దక్కించుకుంది.

Source: Instagram/Hansika Motwani

‘దేశముదురు’లో నటనకుగాను ‘ఉత్తమ పరిచయ నటి’గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును గెల్చుకుంది.

Source: Instagram/Hansika Motwani 

 ప్రస్తుతం హన్సిక చేతిలో ఐదు చిత్రాలు ఉన్నాయి.

Source: Instagram/Hansika Motwani 

ఈమె నటించిన ‘పార్ట్‌నర్’, ‘105 మినిట్స్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణనంతర పనులు జరుపుకొంటున్నాయి.

Source: Instagram/Hansika Motwani

హన్సిక సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్‌. ఎప్పటికప్పుడూ తన గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.

Source: Instagram/Hansika Motwani 

ఇన్‌స్టాలో ఆమెకి 5.4 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Source: Instagram/Hansika Motwani 

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home