హార్దిక్ పాండ్య ప్రియసఖి నటాషా స్టాంకోవిచ్
క్రికెటర్ హార్దిక్ పాండ్య, నటి నటాషా స్టాంకోవిచ్ జంట ఇటీవల వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ ఉదయ్‌పుర్‌లో ప్రేమికుల రోజున రెండోసారి వివాహం చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
Image : natasastankovic instagram
కరోనా, లాక్‌డౌన్ కారణంగా తొలిసారి వివాహ వేడుకను ఆస్వాదించలేకపోయారు. అందుకే.. ఈ సారి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలతో పెళ్లిని ధూమ్‌ధామ్‌గా జరిపించుకున్నారు.
Image : natasastankovic instagram
హార్దిక్.. భార్య నటాషా స్టాంకోవిచ్ సెర్బియాలోని పొజారెవాక్‌లో జన్మించింది. నటన, డ్యాన్స్‌పై ఆసక్తితో 2012లో భారత్‌లో అడుగుపెట్టింది.
Image : natasastankovic instagram
పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించిన ఈమె బాలీవుడ్‌లో తొలిసారి ‘సత్యాగ్రహ’లోని ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.
Image : natasastankovic instagram
‘డిష్‌కియాన్’, ‘7 అవర్స్ టు గో’లో నటాషా ప్రధాన పాత్రలు పోషించింది. ఇప్పటి వరకు ఈమె డజనుకుపైగా చిత్రాల్లో ప్రత్యేక గీతాలకే పరిమితమైంది.
Image : natasastankovic instagram
కేవలం సినిమాల్లోనే కాకుండా నటాషా ‘బిగ్‌బాస్-8’ రియాలిటీ షోలోనూ కనిపించింది. ‘నాచ్ బాలియే’ అనే డ్యాన్స్ రియాలిటీ టెలివిజన్ షోలోనూ మెప్పించింది.
Image : natasastankovic instagram
2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో పాండ్య.. నటాషా చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.
Image : natasastankovic instagram
లాక్‌డౌన్ సమయంలో తన భార్య గర్భవతి అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినప్పుడే.. అతడికి పెళ్లైందని బయటి ప్రపంచానికి తెలిసింది.
Image : natasastankovic instagram
అదే ఏడాది జులైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది నటాషా. ఆ బాబుకి అగస్త్య పాండ్య అని నామకరణం చేశారు.
Image : natasastankovic instagram
ఇక పెళ్లి తర్వాత నటాషా సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. హార్దిక్ పాండ్య ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడకు వెళ్లి స్టాండ్స్ నుంచి అతడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది.
Image : natasastankovic instagram