10,000 రకాల ఆభరణాలకు మూడేళ్లు!

ప్రస్తుతం యువతులు, మహిళలు ‘హీరామండీ’ నగల ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న ఆ నగల గురించి ఆసక్తికర విషయాలు..

వెబ్‌ సిరీస్‌లో వాడిన నగలకు సంబంధించిన 10,000 డిజైన్‌లు తయారు చేసేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. 

మొఘలుల కాలం నాటి డిజైన్‌లోనే ఆభరణాలు కావాలని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ అడగ్గా.. పరమణి జ్యువెల్స్‌ సంస్థ తయారు చేసింది.

200 ఏళ్ల నాటి సంస్కృతి ఆ నగల్లో కనిపించాలని భన్సాలీ చెప్పారట. అందుకు తగ్గట్టుగా పరమణి జువెల్స్‌ తరఫున వినయ్‌, అన్షు గుప్తా డిజైన్‌ చేశారు.

మొఘల్‌ వంశస్థులు తమ రాజసానికి ప్రతీకగా బంగారం, వజ్రాలు, ఎమరాల్డ్స్‌, రూబీలతో నగలు ధరించేవారు.

నగల తయారీకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అసలైన బంగారంతో చేయించడం వల్ల చాలా ఖరీదు అయ్యాయని సినిమా బృందం చెప్పింది. 

చాంద్‌బిలి ఇయర్‌ రింగ్స్‌, హాత్‌ఫూల్‌, పువ్వుల ఉంగరాలు, కంఠాభరణాలు, పట్టీలు, పాపిట బిళ్లలు, ముక్కు పుడకలు ఇలా అనేక రకాల డిజైన్లను ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.

ఎనిమిది ఎపిసోడ్లలో ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో థీమ్‌తో నగలను తయారు చేశారు. ఒక ఎపిసోడ్‌లో ధరించిన నగలు మరో ఎపిసోడ్‌లో కనిపించవు.

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే..

సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

Eenadu.net Home