కల్ట్ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి
‘నెరు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళీ భామ అనశ్వర రాజన్. త్వరలో కల్ట్ లవ్‌స్టోరీ ‘7/Gబృందావన కాలనీ 2’లో సందడి చేయనుందని సమాచారం.
కేరళలో పుట్టిపెరిగిన అనశ్వర రాజన్ 2017లో మంజు వారియర్ ‘ఉదాహరణం సుజాత’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.
సినిమాల్లోకి రాకముందు స్కూల్‌లో మోనో యాక్ట్‌లు, నాటకాలు వేసేది. అలా నటనపై ఆసక్తి పెరిగింది అని ఓ సందర్భంలో పంచుకుంది.
ఈ 22 ఏళ్ల మలయాళీ భామ ఆరేళ్లలో 16 సినిమాలు చేసి మాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంది.
అనస్వర 2024లో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ‘గురువాయూర్ అంబలనాదయిల్’లో నటించింది. ఈ సినిమా రూ.90కోట్లు వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది.
ట్రిప్ అంటే మాత్రం ఫ్రెండ్స్‌తో కలిసి పారిస్ వెళ్లాల్సిందే. లేదంటే జలపాతం, సంగీతమే తన ఫ్రెండ్స్.
పెంపుడు జంతువులంటే అనశ్వరకి ఇష్టం. వెకేషన్స్‌ని మనమే కాదు అవీ ఎంజాయ్ చేయాలంటూ.. వెంట తీసుకెళుతుంది.
అనశ్వర పుస్తకాల పురుగు.. తీరిక దొరికితే లైబ్రరీలోనే గడిపేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనశ్వరని 1.7 మిలియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు.