మనీషా రాణి.. సోషల్‌మీడియా క్వీన్‌..!

ఓ మారుమూల గ్రామంలో పుట్టి.. కష్టాలను ఎదుర్కొని.. సోషల్‌మీడియా సెలబ్రిటీగా మారిన మనీషా రాణి.. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఓటీటీలో సందడి చేస్తోంది.

Image: Instagram/Manisha Rani

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్‌ ఓటీటీలో కంటెస్టెంట్‌గా మనీషా అడుగుపెట్టడంతో నెటిజన్లు ఈమె గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు.

Image: Instagram/Manisha Rani

బిహార్‌లో ముంగేర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించిన మనీషా.. ఈ స్థాయికి చేరడానికి పడ్డ కష్టాలు.. సినిమాను తలపిస్తాయి. 

Image: Instagram/Manisha Rani

This browser does not support the video element.

మనీషాకి చిన్నవయసులోనే డ్యాన్స్‌, ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తి కలిగిందట. కానీ, వీటిని నేర్చుకోవడానికి తండ్రి ఒప్పుకోలేదు.  

Image: Instagram/Manisha Rani

ఇంట్లో వాళ్లు చెప్పినట్లు ఉండలేక.. తన ప్యాషన్‌ను వదులుకోలేక.. ఇల్లు వదిలేసి.. టికెట్‌ తీసుకోకుండా కోల్‌కతా రైలు ఎక్కేసింది. టికెట్‌ లేకపోవడంతో రెండు గంటలపాటు జైల్ శిక్ష కూడా అనుభవించింది. 

Image: Instagram/Manisha Rani

డ్యాన్స్‌పై తనకున్న అమితాసక్తితో ఎలాగైనా తనను తాను నిరూపించుకునే వరకు తిరిగి ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. 

Image: Instagram/Manisha Rani

కోల్‌కతాలోని ఓ మురికివాడలో ఇరుకైన ఇంట్లో ఉంటూ.. వివాహా వేడుకల్లో అతిథులకు వడ్డించే వెయిట్రెస్‌గా, సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా పనిచేసింది. 

Image: Instagram/Manisha Rani

ఖాళీ సమయాల్లో టిక్‌టాక్‌ వీడియోలు(భారత్‌లో బ్యాన్‌ చేయడానికి ముందు) చేయడం మొదలుపెట్టింది. అదే మనీషా జీవితాన్ని మలుపుతిప్పింది.

Image: Instagram/Manisha Rani

This browser does not support the video element.

తనకిష్టమైన డ్యాన్స్‌, ఫ్యాషన్‌కు సంబంధించి.. మనీషా చేసే టిక్‌టాక్‌ వీడియోలకు యూజర్ల నుంచి లైకుల వర్షం కురిసేది. అలా.. టిక్‌టాక్‌ స్టార్‌గా మారింది. 

Image: Instagram/Manisha Rani

దేశంలో టిక్‌టాక్‌ బ్యాన్‌ కావడంతో ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్‌తో, కంటెంట్‌ వీడియోస్‌తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.  

Image: Instagram/Manisha Rani

ప్రస్తుతం ఇన్‌స్టాలో మనీషాకు 4.8 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. దీంతో సోషల్‌మీడియా సెలబ్రిటీగా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లింది మనీషా.

Image: Instagram/Manisha Rani

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home