హోండా కొత్త 350cc బైక్‌ 

‘హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా’ 350cc సెగ్మెంట్‌లో మరో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది.

ఇప్పటికే హోండాలో 350cc సిరీస్‌లో H'ness సీబీ350, సీబీ350ఆర్‌ఎస్‌ మోడళ్లు ఉన్నాయి. కొత్తగా సీబీ350ని విడుదల చేసింది. 

సీబీ350 డీఎల్‌ఎక్స్‌ వేరియంట్‌ ధర రూ.1.99 లక్షలు. డీఎల్‌ఎక్స్‌ ప్రో వేరియంట్‌ ధర రూ.2.17 లక్షలు.

ఐదు రంగుల్లో ఈ బైక్‌ అందుబాటులో ఉంది. 

ఎల్‌ఈడీ ల్యాంప్‌, అనలాగ్‌-డిజిటల్‌ కన్సోల్‌, హోండా స్మార్ట్‌ఫోన్‌ వాయిస్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హజార్డ్‌ ల్యాంప్‌తో ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌ ఈ బైక్‌ ప్రత్యేకత.

348.36 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తోంది.

ఈ బైక్‌ 30ఎన్‌ఎం టార్క్‌, 20.78 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా హోండా వీటిని విక్రయించబోతోంది. 

10 ఏళ్ల వారెంటీ ప్యాకేజీని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

జీవిత బీమాలో ఈ మార్పులు తెలుసా?

యాపిల్‌ని దాటేసిన ఎన్‌విడియా

సెన్సెక్స్‌ చరిత్రలో భారీ పతనాలివీ..

Eenadu.net Home