హ్యుందాయ్‌ ఐపీఓ విశేషాలు 

దేశంలోనే అతి పెద్ద ఐపీఓకు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సిద్ధమైంది. ఈ ఐపీఓపై మదుపర్లలో ఆసక్తి నెలకొంది.

హ్యుందాయ్‌ అనుబంధ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓ ద్వారా రూ.27,870 కోట్లు సమీకరించనుంది.

ఈ పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్ 15- 17 మధ్య తేదీల్లో జరగనుంది. ధరల శ్రేణి రూ.1,865-1,960గా కంపెనీ నిర్ణయించింది. యాంకర్‌ మదుపర్లు 14న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు.

రూ.1.6 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో ఐపీఓకు వస్తోంది. తాజా షేర్లను జారీ చేయడం లేదు.

రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 7 షేర్లు (ఒక లాట్‌) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో లాట్‌ కొనుగోలుకు రూ.13,720 వెచ్చించాలి. గరిష్ఠంగా 14 లాట్లు కొనుగోలు చేయొచ్చు.

ఐపీఓలో భాగంగా 14,21,94,700 ఈక్విటీ షేర్లను కంపెనీ ఈ ఇష్యూలో విక్రయించనుంది.

అర్హత కలిగిన ఉద్యోగుల కోసం 7,78,400 షేర్లను రిజర్వ్‌ చేసింది. ఒక్కో షేరును రూ.186 రాయితీపై వీరికి కేటాయిస్తారు.

విక్రయానికి ఉంచిన మొత్తం షేర్లలో 50% అర్హత కలిగిన సంస్థాగత మదుపర్లకు, 15% సంస్థాగతేతర మదుపర్లకు, 35% రిటైలర్లకు కేటాయిస్తారు.

భారత్‌లో 1996 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యుందాయ్‌ మోటార్‌.. మారుతీ సుజుకీ తర్వాత రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉంది.

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home