ఇష్క్‌లో మునిగితేలుతున్న ఇలియానా
తెలుగులో తెరకెక్కిన ‘దేవదాసు’తో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది ఇలియానా.
Source:Instagram/Ileana
‘పోకిరి’, ‘దేవదాసు’, ‘రాఖీ’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ వంటి హిట్ చిత్రాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందీ గోవా బ్యూటీ.
Source:Instagram/Ileana
‘బర్ఫీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా అక్కడ అనుకున్నంత స్థాయిలో క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది.
Source:Instagram/Ileana
ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్‌లో ఉందని వార్తలొస్తున్నాయి.
Source:Instagram/Ileana
ఈ ఏడాది కత్రినా.. తన పుట్టినరోజు వేడుకల కోసం భర్త విక్కీ, సోదరుడు సెబాస్టియన్, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లగా ఈ వేడుకల్లో ఇలియానా సైతం పాల్గొంది.
Source:Instagram/Ileana
ఈ వేడుకల్లో సెబాస్టియన్‌తో ఇలియానా సందడి చేయడం, అతడి ఇన్‌స్టా ఖాతాని గత కొంతకాలంగా ఫాలో చేస్తుండటంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు.
Source:Instagram/Ileana
ఇలియానా గతంలో ఆండ్రూ అనే ఓ విదేశీ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ 2019లో విడిపోయారు.
Source:Instagram/Ileana
తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె ప్రస్తుతం టాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉంది. ఆరేళ్ల తర్వాత (2018) ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది.
Source:Instagram/Ileana
ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీంతో ఇలియానా హిందీ చిత్రాలపై దృష్టి పెట్టింది.
Source:Instagram/Ileana
ఆమె నటించిన ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ షూటింగ్ పూర్తి కాగా.. మరో సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది.
Source:Instagram/Ileana
గ్లామర్ ఫొటోలు పెడుతూ నెట్టింట ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఇలియానా.
Source:Instagram/Ileana
ఇన్ స్టాలో ఇలియానాకి 14.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
Source:Instagram/Ileana